కిట్ల కొరత..పరీక్షల్లో కోత

ABN , First Publish Date - 2021-05-04T04:11:56+05:30 IST

కరోనా పరీక్షల్లో ప్రభుత్వం భారీగా కోతలు విధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ బయటకు చెప్పక పోయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరీక్షల సంఖ్య గణ నీయంగా తగ్గిపోయింది.

కిట్ల కొరత..పరీక్షల్లో కోత
తాండూర్‌ పీహెచ్‌సీ ఎదుట ఆందోళనకు దిగిన ప్రజలు (ఫైల్‌)

పీహెచ్‌సీల్లో కరోనా టెస్టుల తగ్గింపు

-క్యూలో ఉన్నవారికీ పరీక్షలు చేయని వైనం

-పరిమిత సంఖ్యలోనే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు

-ఆందోళనకు దిగుతున్న అనుమానితులు

మంచిర్యాల, మే 3 (ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షల్లో ప్రభుత్వం భారీగా కోతలు విధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ బయటకు చెప్పక పోయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరీక్షల సంఖ్య గణ నీయంగా తగ్గిపోయింది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అన్ని వర్గాల ప్రజలు వైరస్‌ బారిన పడుతున్న విషయం తెలిసిందే. జలుబు, జ్వరం, తదితర సాధారణ రుగ్మ తలు ఉన్నా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడం తప్ప నిసరిగా మారింది. వైరస్‌ ప్రాథమిక దశలో ఉన్న ప్పుడే గుర్తించగలిగితే ప్రాణాపాయం నుంచి బయ ట పడవచ్చునని ప్రచారం జరుగుతుండటంతో ప్రజ లు పరీక్షలు చేయించుకొనేందుకు ఆరాట పడుతు న్నారు. దీంతో ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌, క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రు ల తోపాటు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న వారు ప్రైవేటు లోనూ పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ప్ర జల అవసరాల మేరకు వైద్యపరమైన కిట్లు అందు బాటులో లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలె త్తింది. కరోనా పరీక్షల నిర్ధారణ కోసం లక్షణాలుగల బాధితులు ఆస్పత్రుల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. పరిమిత సంఖ్యలో కొవిడ్‌ -19 పరీక్షల కారణంగా రో జుల తరబడి పరీక్ష కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ చే యాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని దాదాపు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. పరీక్షల కోసం ఉదయం 8 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నా రంటే అతిశయోక్తికాదు. 

పీహెచ్‌సీల్లో తగ్గిన పరీక్షలు...!

రెండోదశ కరోనా విళయతాండవం చేస్తున్న సమ యంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గించడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటే దాదాపు 50శాతం మేర ప్రభుత్వ ఆ స్పత్రుల్లో పరీక్షలు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ మే రకు ప్రభుత్వాల నుంచి వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశా లు జారీ అయినట్లు సమాచారం. కరోనా సెకండ్‌ వే వ్‌ ప్రారంభంలో ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆస్పత్రుల్లో గరిష్టంగా 50 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించిన అధికారులు ప్ర స్తుతం అందులో సగానికి సగం తగ్గించారు. కొద్ది రో జులుగా జిల్లాలోని 30 కొవిడ్‌ పరీక్ష కేంద్రాల్లో నిర్వ హిస్తున్న పరీక్షల సంఖ్యను పరిశీలించే గణనీయంగా టెస్టులు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పీహెచ్‌సీల్లో 25 నుంచి 35 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహి స్తున్నారు. దీంతో పీహెచ్‌సీలకు వచ్చిన అనేక మంది బాధితులు టెస్టులు చేయించకుండానే వెనుదిరుగు తున్నారు. పరీక్షల సంఖ్య తగ్గించడంతో ప్రజలు ఉద యం 8 గంటల నుంచే పీహెచ్‌సీల ముందు క్యూలు కడుతున్నారు. అయితే క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్లు, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రిలో మాత్రం య థావిధిగా పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే మొబైల్‌ టీంలు కొద్ది రోజులుగా పరీక్షలు ని ర్వహించిన దాఖలాలు లేవు. 

వేధిస్తోన్న కిట్ల కొరత...

ప్రభుత్వపరంగా కొవిడ్‌ నిర్ధారణ కిట్లు సరిపడా స రఫరా కాకపోవడంతోనే పరీక్షల సంఖ్య తగ్గించిన ట్లు తెలుస్తోంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించు కొనే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ...అం దుకు సరిపడా కిట్లు అందుబాటులో లేకపోవ డంతో ప్రభుత్వం కూడా పొదుపుగా వాడుకోవాలని ఆదేశా లు జారీ చేసింది. ఇందులో భాగంగా రోజు వారీ పరీ క్షల సంఖ్యను అధికారులు తగ్గించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు సగటున 35 వరకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు అందుబాటు లో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఆపైన పరీక్షల కో సం వచ్చేవారిని మరుసటి రావాలని చెబుతున్నట్లు సమాచారం. అదికూడా లక్షణాలు తీవ్రంగా ఉన్న వా రికే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆర్టీపీసీఆర్‌ కిట్లు కూడా పూర్తిస్థాయిలో అం దుబాటులో లేవు. జిల్లా వ్యాప్తంగా కేవలం నస్పూర్‌, పాత మంచిర్యాల, రాజీవ్‌నగర్‌, మందమర్రి తోపాటు జిల్లా ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో 50 ఆర్టీపీసీ ఆర్‌ పరీక్షలు చేస్తుం డగా, పై నాలుగు పీహెచ్‌సీల్లో 10 మంది చొప్పున ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. దీంతో వ్యాధి లక్ష ణాలు తీవ్రంగా ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసు కుంటున్నారు.  

ఆందోళనకు దిగుతున్న బాధితులు...

వ్యాధి లక్షణాలు తీవ్రస్థాయిలో ఉండటం ...పీహె చ్‌సీల్లో పరిమిత సంఖ్యలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీ క్షలు నిర్వహిస్తుండటంతో బాధితులు ఆందోళనకు ది గుతున్నారు. గత నెల 30న తాండూర్‌ ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం ఎదుట బాధితులు ఆందోళనకు దిగా రు. అలాగే బెల్లంపల్లి ఆసుపత్రి వద్ద పరీక్షలు నిర్వ హించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు వైద్యులతో వా గ్వాదానికి దిగారు. బాధితుల సంఖ్యకు సరిపడా ర్యా పిడ్‌ యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ కిట్లు అందుబాటులో ఉంచేలా జిల్లా ఉన్నతాధికారులు అవసరమైన చర్య లు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  


Updated Date - 2021-05-04T04:11:56+05:30 IST