కేన్సర్‌ మందుల కొరత!

ABN , First Publish Date - 2020-04-21T04:36:59+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా అత్యవసర మందులకూ కొరత ఏర్పడుతోంది. మరీ ముఖ్యంగా కేన్సర్‌ చికిత్సలో కీలకమైన కీమోథెరపీకి ఉపయోగించే

కేన్సర్‌ మందుల కొరత!

లాక్‌డౌన్‌ కారణంగా అత్యవసర మందులకూ కొరత ఏర్పడుతోంది. మరీ ముఖ్యంగా కేన్సర్‌ చికిత్సలో కీలకమైన కీమోథెరపీకి ఉపయోగించే మందుల దిగుమతి ఆగిపోవడంతో, ఉన్నంతలో అనుకూలమైన చికిత్సతో వ్యాధిని అదుపులో ఉంచే  ప్రయత్నాలు చేస్తున్నారు

వైద్యులు!


‘‘లాక్‌డౌన్‌ కారణంగా కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే బహుళజాతి సంస్థల డ్రగ్స్‌, కీమోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఓరల్‌ మెడిసిన్స్‌కు కొరత ఏర్పడింది. కేన్సర్‌ చికిత్సలో దశ, వయసు, కేన్సర్‌ కణాలు స్పందించే తీరు ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కొందరికి ఒక డ్రగ్‌కు బదులు ఇతరత్రా ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించే వెసులుబాటు ఉంటుంది. 


ఇందుకు వీలుగా పలు కంపెనీలు పలు రకాల మందులను తయారు చేస్తూ ఉంటాయి. అయితే ఇంకొందరికి ఇలా వీలుపడదు. మరీ ముఖ్యంగా సింగిల్‌ కంపెనీల్లో మాత్రమే తయారయ్యే కొన్ని మందులకు ప్రత్యామ్నాయ మందులు ఉండవు. ఉదాహరణకు రొమ్ము కేన్సర్‌కు వాడే ‘పాల్‌బేస్‌’, రక్త కేన్సర్‌కు వాడే నోవార్టిస్‌ కంపెనీ తయారుచేసే ‘టాసిగ్నా’, సి.ఎమ్‌.ఎల్‌ అనే కేన్సర్‌ సంబంధ నోటి మాత్రలు వాడేవారు వాటిని తప్ప ప్రత్యామ్నాయ మందులను వాడే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితిలో రోగులకు మందుల వాడకాన్ని పొడిగించే విధానాన్ని సూచిస్తున్నాం.


రేడియేషన్‌, కీమోథెరపీ చికిత్సలను కూడా తక్కువ మోతాదుతో ఎక్కువ సెషన్స్‌తో కొనసాగిస్తున్నాం. లో, మీడియం, హై రిస్క్‌... మూడు రకాల రోగుల ఆరోగ్య స్థితులను బట్టి, వారికి చికిత్స ప్రాధాన్యాలను అనుసరిస్తున్నాం. అలాగే ఎలెక్టివ్‌, ఎమర్జెన్సీ సర్జరీలుగా అత్యవసర సర్జరీలను విభజించుకుని, ప్రాధాన్యతాక్రమంలో నడుచుకుంటున్నాం. కేన్సర్‌ చికిత్సలో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ, యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ మెడికల్‌ ఆంకాలజీ మార్గదర్శకాలను అనురిస్తున్నాం! లాక్‌డౌన్‌ కారణంగా దూర పారంతాల నుంచి ఆస్పత్రికి రాలేని వారికి, ఫోన్‌ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం.’’


డాక్టర్‌ నిఖిల్‌ ఘడ్యాల్‌పాటిల్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌,హైదరాబాద్‌ 

Updated Date - 2020-04-21T04:36:59+05:30 IST