మ్యాచింగ్‌ సెంటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌

ABN , First Publish Date - 2021-06-23T05:28:20+05:30 IST

మండల కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో మంగళవారం జరిగిన షార్టు సర్క్యూట్‌లో రూ.8 లక్షలు విలువైన ఆస్తినష్టం జరిగింది.

మ్యాచింగ్‌ సెంటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌
ఖానాపూర్‌లో జరిగిన షార్టు సర్క్యూట్‌లో దగ్దమైన దుస్తులు

రూ, 8 లక్షల విలువైన దుస్తులు దగ్ధం

ఖానాపూర్‌, జూన్‌ 22 : మండల కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో మంగళవారం జరిగిన షార్టు సర్క్యూట్‌లో రూ.8 లక్షలు విలువైన ఆస్తినష్టం జరిగింది. వివరాల్లోకెలితే ఖానాపూర్‌ ఎస్‌ఐ రామునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం. తెలంగాణ తల్లి చౌరస్తాలో గల గొడ్డేటి గంగన్నకు చెందిన లాస్య మ్యాచింగ్‌ సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతం లో షార్టు సర్క్యూట్‌ జరిగింది. దీంతో దుకాణంలోని బట్టలదుకాణంలో విలువైన దుస్తువులన్నీ ఖాళీ బుడిద అయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో రూ.8 లక్షల విలు వైన బట్టలు దగ్దం అయ్యాయని ఎస్‌ఐ రామునాయక్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమకు జీవనాదరమైన బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో తాము తీవ్రంగా నష్ట పోయామని బాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పట్టణ నడిబొడ్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో గమనించిన స్థానికులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమా చారం అందజేశారు. ఫైర్‌ఇంజన్‌ వచ్చి మంటలు ఆర్పేయడంతో పెను ప్రమా దం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 


Updated Date - 2021-06-23T05:28:20+05:30 IST