షోర్‌ భాజా

ABN , First Publish Date - 2020-10-24T22:12:41+05:30 IST

బెంగాల్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వాడవాడలా దుర్గాదేవి ప్రతిమలు కొలువుదీరుతాయి. ఈ పండుగ పర్వదినాన ప్రతి ఇంటా షోర్‌ భాజా స్వీట్‌ తప్పకు రుచి చూస్తారు.

షోర్‌ భాజా

పండుగ వేళ ప్రత్యేక వంటకాలు ఉండాల్సిందే. అయితే రొటీన్‌గా కాకుండా ఈసారి వెరైటీగా తీపి, కారం కలగలసిన రెసిపీలను టేస్ట్‌ చేద్దాం. గుజరాత్‌ ఫఫ్డా, మహారాష్ట్ర కడాకనీ, కేరళ యెరియప్ప... అలాంటివే.  ఇంకెందుకాలస్యం దసరా రోజున ఇంటిల్లిపాది ఈ సరికొత్త రుచులను  ఆస్వాదించండి. 


బెంగాల్‌లో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వాడవాడలా దుర్గాదేవి ప్రతిమలు కొలువుదీరుతాయి. ఈ పండుగ పర్వదినాన ప్రతి ఇంటా షోర్‌ భాజా స్వీట్‌  తప్పకు రుచి చూస్తారు.


కావలసినవి: పాలు - ఒక లీటరు, పంచదార - పావుకేజీ, నెయ్యి - తగినంత, పిస్తా - కొద్దిగా. 


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. అందులో పంచదార వేసి పాకం వచ్చే వరకు మరిగించాలి. మరొక పాత్రలో పాలు తీసుకుని మరిగించాలి. పాలు బాగా మరిగి పైన మీగడ వస్తుంది. మీగడ తయారవుతున్న కొద్దీ ఒక స్పూన్‌తో ప్లేట్‌లోకి తీసుకుంటూ ఉండాలి. అలా సేకరించిన మీగడను వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని చతురస్రాకార ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత కట్‌ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి వేగించాలి. వేగించుకున్న స్వీట్‌ ముక్కలను పంచదార పానకంలో వేయాలి. పావుగంట తరువాత పానకంలో నుంచి తీసి పిస్తాతో గార్నిష్‌ చేసి అందించాలి.

Updated Date - 2020-10-24T22:12:41+05:30 IST