దుకాణాలు తెరవొచ్చు...

ABN , First Publish Date - 2020-06-02T23:04:22+05:30 IST

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేపటి నుండి నేలకొండపల్లిలో ఉదయం 6 గంటల నుంచి 11 గం"ల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చు.

దుకాణాలు తెరవొచ్చు...

నేలకొండపల్లి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేపటి నుండి నేలకొండపల్లిలో ఉదయం 6 గంటల నుంచి 11 గం"ల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చు.


 భౌతిక దూరం పాటించేట్లు షాపు యజమానులు చర్యలు తీసుకోవాలి. లేదంటే షాపులకు జరిమానాలు విధించి, సీజ్ చేస్తారు. అవసరం మేరకే ప్రజలు బయటకు రావాలి. ఇక ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలి. చేతులను విధిగా శానిటైజ్ చేసుకోవాలి. మాస్కులను వినియోగించాలి.


 మాస్కులు లేకుండా వీధులలో తిరిగితే రూ. వెయ్యి లేదా ఆ పైన కూడా ఫైన్ విధిస్తారు. 

ఆందోళన చెందవద్దు...  దగ్గు,జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటె ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలి. ఇక  ఆర్ ఎం పి లు పై లక్షణాలు ఉన్న వారికి ఎలాంటి వైద్యం అందించినా... చట్టపరమైన చర్యలుంటాయి. 


 మెడికల్ షాపుల యజమానులుకూడా నిబంధనలు పాటించాలి. సర్పంచి రాయపూడి నవీన్ కుమార్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-06-02T23:04:22+05:30 IST