ట్విట్టర్‌లోనూ షాపింగ్‌ సెక్షన్‌

ABN , First Publish Date - 2021-07-31T06:05:49+05:30 IST

ట్విట్టర్‌ వివిధ బ్రాండ్ల కోసం కొత్తగా షాపింగ్‌ సెక్షన్‌ను ఆరంభించనుంది. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇది వస్తే వ్యాపార సంస్థలు తమ ప్రొఫైల్స్‌కు అదనంగా షాపింగ్‌ సెక్షన్‌ను కూడా కలుపుకోవచ్చు.

ట్విట్టర్‌లోనూ షాపింగ్‌ సెక్షన్‌

ట్విట్టర్‌ వివిధ బ్రాండ్ల కోసం కొత్తగా షాపింగ్‌ సెక్షన్‌ను ఆరంభించనుంది. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇది వస్తే వ్యాపార సంస్థలు తమ ప్రొఫైల్స్‌కు అదనంగా షాపింగ్‌ సెక్షన్‌ను కూడా కలుపుకోవచ్చు. దీన్ని షాప్‌ మాడ్యులర్‌ అంటారు. విజిటర్లు బ్రౌజ్‌ చేసేందుకు వీలుగా ఉంటుంది. ప్రస్తుతానికి పైలెట్‌ టెస్ట్‌ని ఐఓఎస్‌ డివైస్‌లకు ఇంగ్లీష్‌ భాషకు పరిమితం చేశారు. ప్రొడక్ట్‌ను టాప్‌ చేస్తే కొనుగోలుకు లింక్‌ చేస్తుంది. దీంతో రోజూ ట్విట్టర్‌లో షాపింగ్‌పై వినియోగదారులు చర్చించుకుంటారు. షాపింగ్‌ మాడ్యూల్‌ను విడుదల చేసి ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులకు మధ్య ఉన్న గ్యాప్‌ను సరిచేయాలనే ఉత్సుకతను ట్విట్టర్‌ వ్యక్తం చేస్తోంది. గేమ్‌ స్టాప్‌, ఆర్డెన్‌ కోవ్‌ వంటి అమెరికాలోని చిన్నపాటి సంస్థలతో టెస్టింగ్‌ చేస్తోంది. 

Updated Date - 2021-07-31T06:05:49+05:30 IST