- నగరంలో 1750 సీసీ కెమెరాల ఏర్పాటు
- అడుగడుగునా పోలీసుల అప్రమత్తం
చెన్నై: నగరంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించే దిశగా బీచ్‌లు, షాపింగ్‌మాల్స్ తదితర ప్రాంతాల వద్ద పోలీసులు డేగకన్నుతో నిఘా వేయాలని నిర్ణయించారు. ఆ మేరకు నగరంలో అదనంగా 1750 సీసీ కెమెరాలు అమర్చే పనులు జరుగుతున్నాయి. నిర్భయ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన రూ.149 కోటతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. నగరంలోని వాణిజ్య కేంద్రాలు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, బీచ్‌లు, పార్కులు, బస్‌స్టేషన్లు తదితర 150 ప్రాంతాలను ఎంపిక చేసి, ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా తాజాగా మరో 1750 సీసీ కెమెరాలను గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరేట్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని ఇతర నగరాలలో పోల్చుకుంటే చెన్నైలో ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. నగరంలోని ఉద్యానవనాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతో పాటు అదనంగా రెండు మూడు కెమెరాలను బిగించనున్నామని, ఈ సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యతలను కార్పొరేషన్ స్వీకరిస్తుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి