నా పెయింటింగ్స్‌ అమ్మి సాయం చేస్తా..

ABN , First Publish Date - 2020-07-16T09:17:42+05:30 IST

ఏస్‌ షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ లాక్‌డౌన్‌ విరామంలో మంచి చిత్రకారిణిగా మారింది. చిన్నప్పటి నుంచి తనకున్న చిత్ర లేఖనం వ్యాపకానికి లాక్‌డౌన్‌లో పదును ...

నా పెయింటింగ్స్‌ అమ్మి సాయం చేస్తా..

న్యూఢిల్లీ: ఏస్‌ షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ లాక్‌డౌన్‌ విరామంలో మంచి చిత్రకారిణిగా మారింది. చిన్నప్పటి నుంచి తనకున్న చిత్ర లేఖనం వ్యాపకానికి లాక్‌డౌన్‌లో పదును పెట్టింది. ఈ సమయంలో గీసిన పలు చిత్రాలను అంజుమ్‌ ఇప్పుడు అమ్మకానికి ఉంచింది. వీటిని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వేలం వేసి.. తద్వారా వచ్చిన మొత్తాన్ని రోజు కూలీలకు, క్రీడా రంగానికి చెందిన దిగువ శ్రేణి సిబ్బందికి అందజేయనున్నట్టు అంజుమ్‌ తెలిపింది. ఈ స్టార్‌ షూటర్‌ కామన్వెల్త్‌ క్రీడలు, షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో 50 మీటర్ల రైఫిల్‌ విభాగంలో పతకాలు నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్న విషయం విదితమే.

Updated Date - 2020-07-16T09:17:42+05:30 IST