లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని కాల్చి చంపండి...

ABN , First Publish Date - 2020-04-02T16:11:57+05:30 IST

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంచలన ఆదేశాలు జారీ చేశారు.....

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని కాల్చి చంపండి...

పోలీసు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడి సంచలన ఆదేశాలు

మనీలా (ఫిలిప్ఫీన్స్) : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంచలన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని సహించేది లేదని, వారిని కాల్చి చంపండి అంటూ ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే ఆ దేశ పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించారు. ఫిలిప్పీన్స్ రాజధాని నగరమైన మనీలాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే టెలివిజన్ లో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కాల్చి చంపండి అంటూ ఆయన ఆదేశించారు.


లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు.దేశంలో ప్రతీ ఒక్కరూ ఇంటి నిర్బంధంలో ఉండి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని కోరారు. ఫిలిప్పీన్స్ దేశంలో 2,311 మందికి కరోనా వైరస్ సోకగా, వారిలో 96 మంది మరణించారు. ప్రతీరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేయాలనిరోడ్రిగో డ్యూటెర్టే కోరారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మీ జీవితాలను ప్రమాదంలో పడేస్తే వారిని కాల్చిచంపండి అంటూ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా దేశాధ్యక్షుడు డ్యూటెర్టే తీవ్రంగా పరిగణించారని, ఈ తీవ్రతను తమ పోలీసులు అర్థం చేసుకున్నారని, కాని ఎవరినీ కాల్చవద్దని ఫిలిఫ్పీన్స్ పోలీసు చీఫ్ చెప్పారు. 

Updated Date - 2020-04-02T16:11:57+05:30 IST