ఫొటో తీయండి...పేపర్‌పై రాయండి!

ABN , First Publish Date - 2020-04-28T06:24:43+05:30 IST

ఎప్పుడూ అవే ఆటలు... బోర్‌ కొడుతున్నాయా? కాస్త అడ్వెంచర్‌గా ఉండాలి. మెదడుకు పని పెట్టేదిగా ఉండాలి అంటే...

ఫొటో తీయండి...పేపర్‌పై రాయండి!

  • ఎప్పుడూ అవే ఆటలు... బోర్‌ కొడుతున్నాయా? కాస్త అడ్వెంచర్‌గా ఉండాలి. మెదడుకు పని పెట్టేదిగా ఉండాలి అంటే.... ఈ ఆటను ట్రై చేయండి.

కావలసినవి:

  1. కెమెరా లేదా స్మార్ట్‌ఫోన్‌
  2. పేపర్
  3. మార్కర్‌


చేయండిలా...

  1. స్మార్ట్‌ఫోన్‌తో లేదా కెమెరాతో చాలా ఫొటోలు తీసే ఉంటారు. ఇప్పుడు కూడా ఫొటోలే తీస్తారు. అయితే మీరు తీసే ఫొటోలు అంగ్ల వర్ణమాల క్రమంలో రావాలి.
  2. ఫొటో తీయడంతో పాటు దాని పేరు పేపర్‌పై రాయాలి.
  3. అ నుంచి  వరకు అన్ని అక్షరాలతో వచ్చేలా వస్తువుల ఫొటోలు తీయాలి.
  4. ఉదాహరణకు ఎ అక్షరం కోసం యాపిల్‌, బి అక్షరం కోసం బిస్కట్‌ ప్యాకెట్‌, సి అక్షరం కోసం క్యాట్‌... ఇలా రకరకాల వస్తువులు, జంతువుల ఫొటోలు తీయాలి.
  5. ఈ యాక్టివిటీతో ఫన్‌తో పాటు క్రియేటివిటీ పెరుగుతుంది. 

Updated Date - 2020-04-28T06:24:43+05:30 IST