Abn logo
Aug 3 2020 @ 13:28PM

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. షాకింగ్ వీడియో విడుదల చేసిన డాక్టర్!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఓ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామితోపాటు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపించారు. ఆ వాదనను సమర్థిస్తూ తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. 


సుశాంత్ మరణానికి ఆత్మహత్య కారణం కాదని చెబుతున్న ఓ వీడియోను ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి ఆ వీడియోలో వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై జరిగే మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ట్వీట్‌ను సుబ్రమణియన్ స్వామి రీ-ట్వీట్ చేశారు. 



Advertisement
Advertisement
Advertisement