వావ్‌.. ప్రణయ్‌

ABN , First Publish Date - 2021-01-21T09:43:01+05:30 IST

భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ టొయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగిన ప్రణయ్‌..

వావ్‌.. ప్రణయ్‌

ఆరోసీడ్‌ జొనాథన్‌కు షాక్‌

నొప్పితో విలవిల్లాడుతూనే విజయం


బ్యాంకాక్‌: భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ టొయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగిన ప్రణయ్‌.. తనకంటే ఎన్నోరెట్లు మెరుగైన ఆసియా క్రీడల చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)కి షాకిచ్చి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలిరౌండ్లో ప్రణయ్‌ 18-21, 21-16, 23-21తో ప్రపంచ ఏడో ర్యాంకరైన జొనాథన్‌ను ఓడించాడు. ఓవైపు పక్కటెముకల నొప్పి వేధిస్తున్నా..మధ్యమధ్యలో చికిత్స తీసుకుంటూనే.. మ్యాచ్‌లో తలపడ్డ ప్రణయ్‌.. తుదకంటా అద్భుతంగా పోరాడి ఫలితం రాబట్టడం విశేషం. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ అర్జున్‌-ధ్రువ్‌ కపిల 23-21, 21-17తో కివీస్‌ జంట ఒలివర్‌-అభినవ్‌ మనోటాపై గెలిచి రెండోరౌండ్‌ చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమిత్‌-సిక్కి, మహిళల డబుల్స్‌లో సిక్కి-అశ్విని జోడీలు ఆరంభ రౌండ్లలోనే ఓడి ఇంటిబాట పట్టాయి. 

Updated Date - 2021-01-21T09:43:01+05:30 IST