అప్పట్లో... నేను స్త్రీనో, పురుషుడ్నో నాకే తెలియదు!

‘గూఢచారి’ సినిమాలో కనువిందు చేసిన హాట్ తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాల. అయితే, ఈమె ఎక్కువగా సౌత్‌లో కంటే ముంబైలోనే హల్‌చల్ చేస్తుంటుంది. బాలీవుడ్ సినిమాలతో పాటూ హాట్ ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ శోభితా... తాజాగా ‘కాస్మోపాలిటన్’ మ్యాగజైన్ ఇండియన్ వర్షన్ కవర్ పేజీపై హొయలుపోయింది. అంతే కాదు, అదే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెండర్, సెక్సువాలిటి వంటి అంశాలపై ఆసక్తికరంగా స్పందించింది...

‘‘నేను చాలా రోజుల వరకూ స్త్రీననో, పురుషుడ్ని అనో భావించేదాన్ని కాదు. అలాంటి ఫీలింగే నాకెప్పుడూ కలగలేదు. అయితే, ఓ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అతడి పట్ల నేను ఆకర్షితురాల్ని అయ్యాను. అతనితో మాట్లాడుతున్నప్పుడే, నాకు స్త్రీననే భావం కలిగింది!’’ అంటూ తన తొలి అనుభవం గురించి వివరించింది శోభితా ధూళిపాల. తెలుగులో త్వరలో ‘మేజర్’ మూవీలో కనిపించనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అలాగే, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలతో పాటూ ‘మంకీ మ్యాన్’ అనే ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది శోభితా. అమేజాన్ ప్రైమ్‌లో ‘మేడిన్ ఇన్ హెవెన్ 2’ వెబ్ సిరీస్‌తో కూడా అలరించనుంది.       

Advertisement

Bollywoodమరిన్ని...