రాజంపేటలో శోభాయాత్ర

ABN , First Publish Date - 2022-08-12T05:12:12+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో 100 అడుగుల జెండాతో శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి బండ్రాళ్లవీధి, అమ్మవారిశాల వీధి, పాత పోలీసు లైను, ఆర్‌.ఎ్‌స.రోడ్డు, పాతబస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో 100 అడుగుల జాతీయ జెండాను పట్టుకొని భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించారు.

రాజంపేటలో శోభాయాత్ర
రాజంపేటలో 100 అడుగుల జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

రాజంపేట, ఆగస్టు 11: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో 100 అడుగుల జెండాతో శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి బండ్రాళ్లవీధి, అమ్మవారిశాల వీధి, పాత పోలీసు లైను, ఆర్‌.ఎ్‌స.రోడ్డు, పాతబస్టాండు, ఆర్టీసీ బస్టాండు మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో 100 అడుగుల జాతీయ జెండాను పట్టుకొని భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మన జాతీయతను మరింత ఇనుమడింపచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, ఆర్‌ఎ్‌సఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్ల రాముడు, బీజేపీ పట్టణ కార్యదర్శి నాగరాజు, కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ 

పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా ముఖద్వారం వద్ద ఈ నెల 13న స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఉన్నట్లు జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి పేర్కొన్నారు. గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 13న ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నట్లు తెలిపారు. జూనియర్‌ కళాశాల నుంచి రాజంపేట ఆర్‌అండ్‌బీ బంగ్లా వరకు జరుగుతున్న భారీ ర్యాలీ అనంతరం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ దండు గోపి, దాసరి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


సిద్దవటంలో... 

మండలంలోని బొగ్గిడివారిపల్లె ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ తులసీధర్‌ అధ్యక్షతన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తులసీధర్‌ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితమే స్వాతంత్య్రం తెచ్చి పెట్టిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జెండా రెపరపలాడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధా పాల్గొన్నారు. 


సంబేపల్లెలో... 

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని మోదీ ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునివ్వడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ముందుకొచ్చారు. వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై స్వచ్ఛందంగా జెండా ఎగురవేస్తున్నారు. 


చిన్నమండెంలో... 

మండలంలోని టి.చాకిబండ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. ఉద్యమకారులు చేసిన పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివయ్య, ఉపాధ్యాయులు సూర్యనారాయణ, రమణయ్య, మహబూబ్‌బాషా, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 


రాయచోటిటౌన్‌లో...

రాయచోటి పట్టణం మాధవరం గ్రామంలోని అమృత్‌ సరోవర్‌ పథకంలో భాగంగా చేసిన జమ్మికుంట అభివృద్ధి పనుల వద్ద తిరంగా మార్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్‌ ఫాహిదాతో కలిసి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి మల్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. భారతదేశ చరిత్రను, స్వాతంత్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు. 

Updated Date - 2022-08-12T05:12:12+05:30 IST