పాకిస్తాన్ ఓటమికి కారణం అదే: షోయబ్ అక్తర్

ABN , First Publish Date - 2020-08-09T22:55:28+05:30 IST

పాకీస్తాన్ మొదటి నుంచి ఇదే తప్పు చేస్తోందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీనిపై అక్తర్ తన యూట్యూబ్ చానల్‌లో..

పాకిస్తాన్ ఓటమికి కారణం అదే: షోయబ్ అక్తర్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మొదటి నుంచి ఒకే తప్పు చేస్తోందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీనిపై అక్తర్ తన యూట్యూబ్ చానల్‌లో ప్రస్తావించాడు. పాకీస్తాన్ చేజేతులా చేసుకుందని, బ్యాట్స్‌మెన్ వైఫల్యం వల్లే ఓడిపోయిందని అక్తర్ అన్నాడు. ‘ భారీ స్కోరు చేసేందుకు పాక్‌కు అవకాశం ఉంది. కానీ దాన్ని జట్టు ఉపయోగించుకోలేక పోయింది. మొదటి నుంచి జట్టు ఇటువంటి తప్పులే చేస్తోంది. 350-400 పరుగులు చేయగలిగినా ఎవరూ కూడా మంచి పాట్నర్‌షిప్ నెలకొల్పలేక పోయారు. అనవసరమైన షాట్లతో బ్యాట్స్‌మెన్ వికెట్లు పోగొట్టుకున్నారు. టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌కు కావలసినంత సమయం ఉంటుంది. నెమ్మదిగా ఆడుతూ సులభమైన బంతులను బౌండరీకి తరలిస్తూ వికెట్‌ను కాపాడుకోవాలి. కానీ పాక్ బ్యాట్స్‌మెన్‌లలో ఒక్కరు కూడా ఇది పాటించలేదు. అందువల్లే విజయం సాధించలేకపోయార’ని అక్తర్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-09T22:55:28+05:30 IST