Abn logo
Oct 22 2021 @ 20:25PM

కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్

ఇస్లామాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్ కోహ్లీ కంటే రోహిత్‌శర్మకు ఎక్కువగా అభిమానులు ఉన్నారని అన్నాడు.


కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే, రోహిత్‌శర్మ మాత్రం అంతకంటే గొప్ప బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు. ఇంకా చెప్పాలంటే రోహిత్.. ఇండియాలో ఇంజమామ్ లాంటి వాడని కితాబిచ్చాడు. భారత ప్రజలపై తమ దేశ పౌరులకు సదభిప్రాయమే ముందని పేర్కొన్నాడు. తనకు భారత్‌లోనూ బోల్డంతమంది అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. తాను భారత్ ప్రేమను పొందిన పాకిస్థాన్ అదృష్టవంతుడినని షోయబ్ పేర్కొన్నాడు. 

ఇవి కూడా చదవండిImage Caption