మరో మూడేళ్ళలో... మార్కెట్‌లోకి ‘షియోమీ’...

ABN , First Publish Date - 2021-11-27T01:48:36+05:30 IST

విద్యుత్తు కార్ల తయారీ రంగంలోకి అడుగిడుతున్నట్లు చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ‘షియోమీ’ ప్రకటించింది. మరో మూడేళ్ళ(2024)లో తన మొదటి విద్యుత్తు వాహనాన్ని లాంచ్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

మరో మూడేళ్ళలో... మార్కెట్‌లోకి ‘షియోమీ’...

న్యూఢిల్లీ / ముంబై : విద్యుత్తు కార్ల తయారీ రంగంలోకి అడుగిడుతున్నట్లు చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ‘షియోమీ’ ప్రకటించింది. మరో మూడేళ్ళ(2024)లో తన మొదటి విద్యుత్తు వాహనాన్ని లాంచ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. విద్యుత్తు వాహనాల పరిశోధన/అభివృద్ధి కోసం... మొత్తం 13,919 మంది సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొంది. రిలో 500 మంది విద్యుత్తు కారు ప్రాజెక్టులో పనిచేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో దాదాపు 14 వేల మంది సభ్యులున్నారని, కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరి శాతం 44 శాతం అని ఓ ఆర్థిక నివేదికలో పేర్కొంది.


విద్యుత్తు వాహనాల తయారీ రంగంలోకి ప్రవేశించడంపై షియోమీ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లీ జున్‌ మాట్లాడుతూ... ‘2024 లో భారీ సంఖ్యలో విద్యుత్తు కార్లను షియోమీ ఉత్పత్తి చేస్తుంది. వచ్చే పదేళ్లలో ఈ రంగంలో సుమారు పది బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాం' అని వెల్లడించారు. షియోమీ తయారు చేసే విద్యుత్తు కారును 2023 సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో తయారు చేయడం ప్రారంభించి, 2024 లో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా... ఇది ప్రస్తుత ప్రణాళిక మాత్రమేనన్నారు. షియోమీ ఇప్పటికే తన ఈవీ కంపెనీ షియోమీ ఈవీని 10 బిలియన్‌ యువాన్ల(రూ. 11 వేల కోట్ల) మూలధనంతో ప్రారంభించింది. షియోమీ మొదటి ఈవీ మార్కెట్‌లోకి ప్రవేశించే సమయంలో... యాపిల్‌, ఒప్పో, వివో, వన్‌ ప్లస్‌ కంపెనీల ఎలక్ట్రిక్‌ కార్లతో పోటీ పడనుంది.

Updated Date - 2021-11-27T01:48:36+05:30 IST