కాంగ్రెస్ లేకుండా శివసేన-ఎన్సీపీ పొత్తు

ABN , First Publish Date - 2022-01-19T22:34:07+05:30 IST

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అయితే గోవాలో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ను సంప్రదించామని..

కాంగ్రెస్ లేకుండా శివసేన-ఎన్సీపీ పొత్తు

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. అయితే గోవాలో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ను సంప్రదించామని కానీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో శివసేనతో కలిసి పోటీకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అయితే మొత్తం స్థానంలో శివసేన-ఎన్సీపీ కూటమి పోటీ చేయకపోవచ్చని, కానీ ఎక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘‘గోవాలో కాంగ్రెస్ గెలిచినా లేదంటే హంగ్ ఏర్పడ్డా ఆ పార్టీతో కూటమి కట్టేది లేదు. ఏదైనా ఉంటే ఎన్నికల ముందే పొత్తు ఉండాలి. గోవాలో ఆయారాం.. గయారాం రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటికి ఈ ఎన్నికలతో ముగింపు పలకాలి’’ అని అన్నారు.

Updated Date - 2022-01-19T22:34:07+05:30 IST