కోవిడ్-19: మధ్య ప్రదేశ్‌లో ఎస్మా ప్రయోగం

ABN , First Publish Date - 2020-04-09T00:36:54+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) అమలు చేయనున్నట్టు...

కోవిడ్-19: మధ్య ప్రదేశ్‌లో ఎస్మా ప్రయోగం

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) అమలు చేయనున్నట్టు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆయన ట్విటర్లో వెల్లడించారు. ‘‘పౌరుల ప్రయోజనార్థం కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కునేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఎస్మాను అమల్లోకి తీసుకొచ్చింది..’’ అని చౌహాన్ పేర్కొన్నారు. కాగా మధ్య ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 229 మంది కరోనా బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. 

Updated Date - 2020-04-09T00:36:54+05:30 IST