ఆర్మీలో పనిచేస్తూ చనిపోయిన అన్న... ప్రభుత్వం నుంచి రూ. కోటి అందుకున్న తండ్రి... ఆ సొమ్ము కోసం తమ్ముడు ఎంతకు తెగించాడంటే...

ABN , First Publish Date - 2022-07-26T16:39:27+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

ఆర్మీలో పనిచేస్తూ చనిపోయిన అన్న... ప్రభుత్వం నుంచి రూ. కోటి అందుకున్న తండ్రి... ఆ సొమ్ము కోసం తమ్ముడు ఎంతకు తెగించాడంటే...

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సుపారి ఇచ్చి తండ్రిని హత్యచేయించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివపురిలో నివాసముంటున్న కుమారుడు సోషల్ మీడియా సహాయంతో బీహార్‌కు చెందిన హంతకుడిని సంప్రదించి, తండ్రిని హత్యచేసేందుకు సుపారీ ఇచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం మహేష్ గుప్తా తుపాకీ కాల్పులకు హతమయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి పెద్ద కుమారుడు సంతోష్ మరణించాడని, రెండవ కుమారుడు తాగుబోతు అని పోలీసుల విచారణలో తేలింది. 


అంకిత్ జూదానికి, తాగుడుకు అలవాటు పడి ప్రతిరోజూ భార్య, తండ్రితో గొడవ పడేవాడు. హత్య కేసు విచారణలో అంకిత్ మొదట్లో పోలీసులను తప్పుదారి పట్టించాడు. అంకిత్ మొబైల్‌ఫోనును స్వాధీనం చేసుకున్న పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ కేసు గురించి శివపురి ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ మృతుడి కుమారుడు అంకిత్ విచారణలో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అంకిత్ ఫోన్ కాల్ వివరాలు, ఇంటర్నెట్ హిస్టరీని సెర్చ్ చేయగా.. బీహార్‌కు చెందిన హంతకుడిని అంకిత్ ఇంటర్నెట్ ద్వారా సంప్రదించి తన తండ్రిని చంపేందుకు సుపారీ ఇచ్చినట్లు తేలింది. కాగా అంకిత్ సోదరుడి సోదరుడు సంతోష్ ఆర్మీలో పనిచేస్తూ మరణించిన నేపధ్యంలో వారి తండ్రి కోటి రూపాయలను ప్రభుత్వం నుంచి అందుకున్నాడు. ఈ సొమ్ము తనకు ఇవ్వాలని అంకిత్ తండ్రిని అడుగుతూ వస్తున్నాడు. అయితే తండ్రి అందుకు నిరాకరించడంతో తండ్రిని దారుణంగా హత్య చేయించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-07-26T16:39:27+05:30 IST