అఖిలేష్‌కు వారం రోజులు గడువిచ్చిన శివపాల్ యాదవ్

ABN , First Publish Date - 2021-11-23T20:19:43+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఆయన..

అఖిలేష్‌కు వారం రోజులు గడువిచ్చిన శివపాల్ యాదవ్

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఆయన చిన్నాన్న, ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (పీఎస్‌పీఎల్) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ అల్టిమేటం ఇచ్చారు. పొత్తా, విలీనమా అనే దానిపై వారం రోజులులోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో శివపాల్ యాదవ్ మాట్లాతూ, సమాజ్‌వాది పార్టీలో విలీనానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏదైనా సరే వారం రోజుల్లో తేల్చకుంటే లక్నోలో తాము సమావేశం ఏర్పాటు చేసి పార్టీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ విషయమై సమాజ్‌వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌ను కూడా శివపాల్ యాదవ్ సోమవారం లక్నోలో కలుసుకుని మంతనాలు జరిపారు.


''సమాజ్‌నాదీ పార్టీతో పొత్తుకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. నేతాజీ (ములాయం) పుట్టినరోజు సందర్భంగా పొత్తు కుదుతుందని రాష్ట్ర ప్రజలు ఆశావహంతో ఉన్నారు. ఏది జరిగినా సాధ్యమైనంత త్వరగా జరగాలి'' అని శివపాల్ అన్నారు. నేతాజా తమకు కుస్తీతో పాటు రాజకీయాల్లో ట్రిక్కులు కూడా నేర్చారని, ఐక్యతలోనే బలం ఉందని, కుటుంబంలో విభజన తలెత్తితే అనేక ఇబ్బందులు ఉంటాయని, తమ మద్దతుదారులకు 100 సీట్లు రావాలని కోరుకుంటున్నందునే తాము వెనక్కి తగ్గామని ఆయన చెప్పారు. పొత్తుతో పాటు, గెలుపు గుర్రాలకు ఎస్‌పీ టిక్కెట్లు ఇచ్చుకోవచ్చని, విలీనానికి తాము సిద్ధంగా ఉన్నాయని, కాలం గడిచిపోతున్నందున నిర్ణయం అనేది వెంటనే తీసుకోవాలని ఆయన సూచించారు.



Updated Date - 2021-11-23T20:19:43+05:30 IST