Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్సీగా శివరామిరెడ్డి ఏకగ్రీవం

 అనంతపురం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సం స్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి ఏకగ్రీవ ంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో భాగంగా శుక్రవా రం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన దాఖలు చేసిన వెంకటశివనాయుడు తన నామినేషనను ఉపసంహరించుకున్నారు. దీంతో శివరామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ నిశాంతకుమార్‌ ఆయనకు ఎమ్మెల్సీ డిక్లరేషన ఫారం అందజేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దీపక్‌రెడ్డి నామినేషన దాఖలు చేసిన నేపథ్యంలో... ఆయనకు పోటీగా ప్రత్యర్థి వైసీపీ నుంచి పైలా నరసింహయ్య నామినేషన వేసిన వి షయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల నుంచి మెజార్టీ సభ్యులున్నప్పటికీ.. అప్పటి ప్రతిపక్ష వైసీపీ పైలాను రంగంలోకి దింపింది. ఆయన పోటీలో ఉంటారని అందరూ భావించిన నేపథ్యంలో రాజకీయం రసవత్తరానికి దారితీసింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో పైలా నరసింహయ్య తన నామినేషనను వితడ్రా చేసుకోవడం, దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం తెలిసిందే. అప్పట్లో భారీ మొత్తంలో చేతు లు మారడంతోనే పైలా నరసింహయ్య వితడ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే తరహాలోనే... సంఖ్యాపరంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీకి స్థానిక సంస్థల నుంచి బలం లేకున్నప్పటికీ... ఆ పార్టీ తరపున కాకుండా... ఆ పార్టీలోని కొందరు నాయకుల ప్రమేయంతో వెంకటశివనాయుడును స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన వేశారు. ఆ తరువాత ఆసక్తికర రాజకీయ ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండాలంటే.. గత ఎన్నికల్లో మాదిరిగానే.. భారీ మొత్తంలో ఓ ప్రైవేట్‌ కళాశాలకు విరాళమివ్వాలని సోషల్‌ మీడియా ద్వారా పోస్టులు బహిర్గతమయ్యాయి. అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి తన నామినేషనను వితడ్రా చేసుకున్నట్లు సమాచారం.

 

Advertisement
Advertisement