పోలవరం తవ్వకాల్లో శివలింగం

ABN , First Publish Date - 2022-05-19T08:55:48+05:30 IST

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన జరుగుతున్న పైలట్‌ చానల్‌ తవ్వకాల్లో భారీ పురాతన శివలింగం బయటపడింది. బుధవారం నిర్వాసిత గ్రామం పాతపైడిపాకలో గోదావరి నది

పోలవరం తవ్వకాల్లో శివలింగం

గోదావరి ఒడ్డున పురాతన ప్రతిమ వెలికితీత 

పైలట్‌ చానల్‌ తవ్వకాల్లో వెలుగులోకి

ఆ ప్రాంతంలో తాత్కాలికంగా పనులు ఆపివేత 


పోలవరం, మే 18: పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన జరుగుతున్న పైలట్‌ చానల్‌ తవ్వకాల్లో భారీ పురాతన శివలింగం బయటపడింది. బుధవారం నిర్వాసిత గ్రామం పాతపైడిపాకలో గోదావరి నది ఒడ్డున వెలికితీశారు. మట్టి తవ్వకాలు చేపడుతుండగా జేసీబీలకు ఓ పురాతన నిర్మాణం తగిలింది. గట్టిగా పైకి లాగడంతో భారీ శివలింగం వెలుగు చూసింది. జేసీబీ ఆపరేటర్లు, టిప్పర్ల డ్రైవర్లు వెంటనే శివలింగాన్ని నీటితో శుభ్రపరిచి గట్టుపై ఉంచారు. ఈ శివలింగాన్ని శతాబ్దాల కాలం నాటిదిగా భావిస్తున్నారు. శివలింగం బయటపడ్డ ప్రాంతంలో పూర్వం  శివాలయం ఉంటుందని భావిస్తున్నారు. పురావస్తు పరిశోధన శాఖ అఽధికారులు దృష్టి సారించి అక్కడ తవ్వకాలు జరిపాలని స్థానికులు కోరుతున్నారు. బయటపడ్డ భారీ శివలింగానికి స్థానికులు, ప్రాజెక్టు కార్మికులు పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చామని తహసీల్దారు బి.సుమతి తెలిపారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో తవ్వకాలు నిలిపివేసి మరో ప్రాంతంలో పనులు చేస్తున్నట్టు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ జీఎం ముద్దుకృష్ణ తెలిపారు.

Updated Date - 2022-05-19T08:55:48+05:30 IST