జ్ఞానవాపిలో శివలింగం.. దైవలీలకు నిదర్శనం

ABN , First Publish Date - 2022-05-24T06:32:43+05:30 IST

వారణాసి క్షేత్రంలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం వెలుగుచూడటం అద్భుతమైన దైవలీలకు నిదర్శనమని చిలుకూరు బాలాజీ ఆలయ వంశపారంపర్య ప్రధాన పూజారి, ఆలయాల

జ్ఞానవాపిలో శివలింగం.. దైవలీలకు నిదర్శనం
శైవవాజ్ఞ్మయ సదస్సులో మాట్లాడుతున్న చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధానార్చకుడు రంగరాజన్‌

 చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధాన పూజారిరంగరాజన్‌

 చెర్వుగట్టులో శైవవాజ్ఞ్మయ జాతీయ సదస్సు 

నార్కట్‌పల్లి, మే 23: వారణాసి క్షేత్రంలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం వెలుగుచూడటం అద్భుతమైన దైవలీలకు నిదర్శనమని చిలుకూరు బాలాజీ ఆలయ వంశపారంపర్య ప్రధాన పూజారి, ఆలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్‌ రంగరాజన్‌ అన్నారు. మండలంలోని చెర్వుగట్టులో కొనసాగుతున్న శైవ వాజ్ఞ్మయ జాతీయ సదస్సు రెండో రోజైన సోమవారం నిర్వ హించిన పండితగోష్టికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం వెలుగుచూసిన స్థలంపై ఆర్టికల్‌ 143 రిఫరెన్స్‌ను తక్షణమే అమలు చేయాలన్నారు. దేవతామూర్తులు, స్వరూపాల హక్కులపై పెండింగ్‌లో ఉన్న ఆర్టికల్‌-363 వివాదాన్ని తక్షణమే పరిష్కరించాలన్నారు. ఆ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను అభ్యర్థిస్తూ తద్వారా శివలింగం హక్కులను కాపాడుకుని పూజలకు ఉపయుక్తమయ్యేలా చూడాలన్నారు. 1991లో సుప్రీంకోర్టు తీర్పుకు తాము వ్యతిరేకం కాదన్నారు. దైవం యొక్క రాజ్యాంగబద్దమైన అధికారాల గురించి తొమ్మిది మందితో కూడిన న్యాయమూర్తుల బృందం వినకున్నా జ్ఞానవాపిలో పరమశివుడే ఈ విషయాన్ని తన ఉనికి ద్వారా ముందుకు తీసుకువచ్చాడన్నారు. కోట్లాది మంది కొలిచే దైవానికి రాజ్యాంగబద్దమైన అధికారాలు ఉన్నాయో లేవో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓ మారుమూల గ్రామంలో ఉండే మహనీయుల విగ్రహానికి చెప్పుల మాలవేస్తే బాఽధ్యులను పట్టుకుని జైలులో వేస్తున్న పోలీసులు జ్ఞానవాపి శివలింగానికి వందల ఏళ్లుగా అవమానం జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగానికి పూజలు పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘ శైవవాజ్ఞ్మయ జాతీయ సదస్సు తీర్మానించింది. కాగా నీలకంఠశివాచార్య రచించిన శైవాగమోక్త సమగ్ర క్రియావళి అనే గ్రంథాన్ని రంగరాజన్‌ ఆవిష్కరించారు. సదస్సులో పోతులపాటి రామలింగేశ్వర శర్మ, నీలకంఠశాస్ర్తి, సుబ్రహ్మణ్యశర్మ, వీ.కల్యాణ్‌కుమార్‌, రావిరాల హనుమయ్య శర్మ, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పచ్‌ మల్గ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2022-05-24T06:32:43+05:30 IST