శివలీలామృతం

ABN , First Publish Date - 2022-02-25T05:30:00+05:30 IST

సర్వం శివమయం అనేది ఆర్యోక్తి. ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అనే నానుడి దీని నుంచే వచ్చి ఉండవచ్చు. సర్వం శివమయినప్పుడు-

శివలీలామృతం

సర్వం శివమయం అనేది ఆర్యోక్తి. ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అనే నానుడి దీని నుంచే వచ్చి ఉండవచ్చు. సర్వం శివమయినప్పుడు- ఆ దేవదేవుడిని మనం ఎలా ఊహించుకుంటామనేది ఒక ప్రశ్న. దీనిని సులభతరం చేయటానికి మన పూర్వీకులు శివరూపాన్ని మూడు రకాలుగా నిర్వహించారు. వీటిలో మొదటిది సకలం. మానవ రూపంలో ఉన్న శివుడి రూపాలివి. చంద్రశేఖరుడు, గంగాధరుడు, మొదలైన రూపాలివి. ఇక రెండోది నిష్కలం. అంటే ప్రతీత్మాకంగా లింగరూపంలో ఉండే రూపాలు. జ్యోతిర్లింగాలు ఈ కోవలోకే వస్తాయి. మూడోది సకల నిష్కలం. ఈ పద్ధతిలోని రూపాలను ముఖలింగాలు  అంటారు. పైన ముఖం ఉంటుంది. కింద లింగం ఉంటుంది. ఇలాంటి రకరకాల శివరూపాలను.. వాటి ఆవిర్భావానికి సంబంధించిన కథలను అందించటానికి చేసిన ప్రయత్నమే - శివలీలలు. కందుకూరి వేంకట సత్య బ్రహ్మచార్య రాసిన ఈ పుస్తకంలో పరమేశ్వరుడి పంచకృత్యాలు (సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహాలు)లకు చెందిన రూపాలు మనకు కనిపిస్తాయి. శివ రూపాలపై ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది. 


శివలీలలు, రచన కందుకూరి వేంకట సత్య బ్రహ్మచార్య

ప్రచురణ: శ్రీ కామాక్షీదేవి పూజాపీఠం, ప్రతులకు: 9491411090

Updated Date - 2022-02-25T05:30:00+05:30 IST