మహాప్రస్థానంలో శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ నిన్న రాత్రి (ఆదివారం) కరోనా తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయేముందు కోవిడ్ నెగటివ్ గా ఏఐజీ వైద్యులు నిర్ధారించారు. నేటి ఉదయం 5గంటలకు డాక్టర్లు ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  మాస్టర్ మృతదేహానికి నేటి (సోమవారం) మధ్యాహ్నాం 2 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతకుముందు మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసంలో అభిమానుల సందర్శనార్థం శివశంకర్ మాస్టర్ మృతదేహాన్ని ఉంచి నివాళులర్పించనున్నారు. 

Advertisement