శివదీక్ష మాల వేస్తున్న గురుస్వాములు
వేములవాడ, జనవరి 19 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. రాజన్న ఆలయంలోని అభిషేక మండపంలో గురుస్వాములు వాసాలమర్రి గోపి, తమ్మల భీమన్న, ఆలయ అర్చకులు నందగిరి భాను, శంకరయ్య సమక్షంలో బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజల మధ్య మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది శివభక్తులు శివదీక్ష స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినం వరకు శివదీక్షలు కొనసాగుతాయని గురుస్వామి వాసాలమర్రి గోపి తెలిపారు.