యూపీలో 50 నుంచి 100 సీట్లలో శివసేన పోటీ

ABN , First Publish Date - 2022-01-12T20:41:33+05:30 IST

త్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీ..

యూపీలో 50 నుంచి 100 సీట్లలో శివసేన పోటీ

ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన పార్టీ 50 నుంచి 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ బుధవారంనాడు ప్రకటించింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయాన్ని బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పశ్చిమ యూపీలో గురువారం తాను పర్యటించనున్నట్టు తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లోని 403 సీట్లు అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 14,20,23,27, మార్చి 3, 7వ తేదీల్లో జరిగే పోలింగ్‌తో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లతో ఘన విజయం సాధించింది. 39.67 శాతం ఓట్ల షేర్ సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బీఎస్‌పీ 19, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి.

Updated Date - 2022-01-12T20:41:33+05:30 IST