మహారాష్ట్ర అసెంబ్లీలోని Sivasena ఆఫీసుకు Seal

ABN , First Publish Date - 2022-07-03T21:39:50+05:30 IST

అసలైన శివసేన తమదేనంటూ ఇటు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన వర్గం, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెండో వర్గం ..

మహారాష్ట్ర అసెంబ్లీలోని Sivasena ఆఫీసుకు Seal

ముంబై: అసలైన శివసేన తమదేనంటూ ఇటు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన వర్గం, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెండో వర్గం క్లెయిమ్ చేస్తుండటంతో మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన కార్యాలయానికి ఆదివారంనాడు సీల్ వేశారు. కార్యాలయం వెలుపల నోటీసు అంటించారు. ''శివసేన లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు కార్యాలయాన్ని మూసివేశాం'' అని ఆ నోటీసులో రాశారు.


షిండే వర్గం నేతలు తాము శివసేనను విడిచిపెట్టలేదని, తమదే అసలైన పార్టీ అని పదేపదే చెబుతున్నారు. అయితే, షిండే వర్గం వాదన చెల్లదని, పార్టీ లోగో, గుర్తింపుపొందిన ధనుస్సు, బాణం గుర్తు వారికి ఎంతమాత్రం చెందదని తక్కిన ఎమ్మెల్యేల వాదనగా ఉంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కిషోర్ తివారి సహా పలువురు పార్టీ నేతలు ఇదే విషయంపై ఢంకా బజాయిస్తున్నారు. ఎవరుపడితే వారు వెళ్లిపోవడం, పార్టీని తన్నుకుపోవడం అంత సులభం కాదని, చాలా లీగల్ అంశాలు కూడా ముడిపడి ఉంటాయని ఆ నేతలు తెలిపారు.

Updated Date - 2022-07-03T21:39:50+05:30 IST