షిర్డీసాయి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-12T07:21:51+05:30 IST

శ్రీషిర్డీసాయి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు తంబాబత్తుల పాలేశ్వరరావు (76) మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య నాగమణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

షిర్డీసాయి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు కన్నుమూత

కడియం, మే 11: శ్రీషిర్డీసాయి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు తంబాబత్తుల పాలేశ్వరరావు (76) మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య నాగమణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  కుమారుడు శ్రీధర్‌ కడియం, రాజమహేంద్రవరం షిర్డీసాయి-డ్యాఫ్నీ విద్యా సంస్థల చైర్మన కాగా కుమార్తె ఉమ చెముడులంకలో శ్రీషిర్డీసాయి విద్యానికేతన్‌ను నడుపుతున్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో రైతు కుటుంబంలో జన్మించిన పాలేశ్వరరావు 1986లో కడియంలో శ్రీషిర్డీ సాయి విద్యానికేతన్‌ను ప్రారంభించారు. నర్సరీ నుంచి డిగ్రీతో పాటు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, అగ్రికల్చర్‌, సివిల్స్‌ వంటి ఎన్నో గ్రూపులను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వారిలో అనేకులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. విద్యా దాత పాలేశ్వరరావు మృతికి పలు విద్యా సంస్థల ప్రతినిధులు, నర్సరీ రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర సంతాపం తెలిపారు.

Updated Date - 2021-05-12T07:21:51+05:30 IST