గాల్లో తేలుతున్న పడవ.. ఫొటోలు వైరల్!

ABN , First Publish Date - 2021-03-06T09:25:04+05:30 IST

పడవలు ఎక్కడ ప్రయాణిస్తాయి? అని అడగ్గానే సమాద్రాల్లో అని టక్కున సమాధానం వచ్చేస్తుంది. అయితే ఎప్పుడైనా గాల్లో తేలుతున్న పడవను చూశారా? అదెలా సాధ్యం అని అనుమానం వచ్చిందా? అయితే కచ్చితంగా ఈ వింత గురించి తెలుసుకోవాల్సిందే. అతని పేరు కోలిన్ మెక్‌కల్లమ్.

గాల్లో తేలుతున్న పడవ.. ఫొటోలు వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: పడవలు ఎక్కడ ప్రయాణిస్తాయి? అని అడగ్గానే సమాద్రాల్లో అని టక్కున సమాధానం వచ్చేస్తుంది. అయితే ఎప్పుడైనా గాల్లో తేలుతున్న పడవను చూశారా? అదెలా సాధ్యం అని అనుమానం వచ్చిందా? అయితే కచ్చితంగా ఈ వింత గురించి తెలుసుకోవాల్సిందే. అతని పేరు కోలిన్ మెక్‌కల్లమ్. స్కాట్లాండ్‌లోని బాఫ్ అనే ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్నాడు. ఆ రోడ్డుపై నుంచి చూస్తే సముద్రంలో వెళ్లే పడవలు కనిపిస్తుంటాయి. ఆరోజు కూడా అలాంటి ఘటనే జరిగింది. అయితే అతని కంట పడిన పడవ నీళ్లో వెళ్లడం లేదు. గాల్లో తేలుతోంది. దాన్ని చూసిన కోలిన్ వెంటనే ఫొటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత జాగ్రత్తగా గమనించి అసలు ఆ పడవ అలా గాల్లో తేలుతున్నట్లు కనిపించడానికి కారణం కనుగొన్నాడు. అతను ఫేస్‌బుక్‌లో పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను పంచుకున్న కోలిన్.. దీన్ని ఓ రియల్ లైఫ్ ఆప్టికల్ ఇల్లూజన్ అని పేర్కొన్నాడు. భూమికి దగ్గరగా తిరిగే మేఘాల వల్లే మనం మోసపోయినట్లు వెల్లడించాడు. ఈ మేఘాలు పడవ కింది భాగాన్ని కప్పేయడంతో పై భాగం గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తోందని తేల్చాడు. ‘‘ఆ పడవను చూడగానే నిజంగానే గాల్లో తేలుతుందని భ్రమపడ్డా’’ అని కోలిన్ తెలిపాడు.


Updated Date - 2021-03-06T09:25:04+05:30 IST