షరతులు లేకుండా షిండే తిరిగి వస్తారు: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-06-21T21:01:18+05:30 IST

ప్రస్తుతానికి ఏక్‌నాథ్ షిండే సహా కొంత మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేస్తున్న ఎత్తులే ఇవి. కానీ బీజేపీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇది మధ్యప్రదేశ్, రాజస్తాన్ కాదు.. మహారాష్ట్ర. ఇక్కడ అలాంటి ఆటలు సాగవు. నాకు ఏక్‌నాథ్ షిండే గురించి బాగా తెలుసు..

షరతులు లేకుండా షిండే తిరిగి వస్తారు: సంజయ్ రౌత్

ముంబై: అందుబాటులో లేకుండా పోయి మహారాష్ట్ర రాజకీయ చట్రంలో కలకలం సృష్టించిన పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్ షిండే ఎలాంటి షరతులు లేకుండా తిరిగి వస్తారని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆయన నిష్పాక్షికమైన శివసైనికుడని, విపక్షాలు భావించినదేమీ జరగదని ఆయన అన్నారు. రాష్ట్రంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతానికి ఏక్‌నాథ్ షిండే సహా కొంత మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేస్తున్న ఎత్తులే ఇవి. కానీ బీజేపీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇది మధ్యప్రదేశ్, రాజస్తాన్ కాదు.. మహారాష్ట్ర. ఇక్కడ అలాంటి ఆటలు సాగవు. నాకు ఏక్‌నాథ్ షిండే గురించి బాగా తెలుసు. ఆయన నిజమైన శివసైనికుడు. ఎలాంటి షరతులు లేకుండా వెనక్కి తిరిగి వస్తారు’’ అని అన్నారు.


శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు వెళ్లారు ఏక్‌నాథ్ షిండే. మహా ప్రభుత్వాన్ని కూల్చడంలో భాగంగా బీజేపీ పన్నిన కుట్ర అనే విమర్శలు ఒకవైపు వస్తుండగా.. ఏక్‌నాథ్ షిండేకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని, ఈ అసంతృప్తితోనే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుని మకాం మార్చారని అంటున్నారు. కాగా, ఇదే విషయమై షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ ప్రభుత్వం బాగా నడుస్తోందని, గడిచిన రెండున్నరేళ్లలో ఇలాంటి ఘటనలు మూడుసార్లు జరిగాయని, అయితే తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేపోయాయని అన్నారు. కాగా, ఈ సంక్షోభంపై శివసేన అధినేత, మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇప్పటి వరకు స్పందించలేదు.

Updated Date - 2022-06-21T21:01:18+05:30 IST