6 నెలల్లో Eknath Shinde ప్రభుత్వం కూలుతుంది.. మధ్యంతర ఎన్నికలు తధ్యం : ఎన్‌సీపీ చీఫ్ Sharad Pawar

ABN , First Publish Date - 2022-07-04T21:05:27+05:30 IST

బీజేపీ(BJP) మద్ధతుతో సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సారధ్యంలో మహారాష్ట్ర(Maharastra)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఎన్‌సీపీ(NCP) చీఫ్ శరద్ పవార్(Sharad

6 నెలల్లో Eknath Shinde ప్రభుత్వం కూలుతుంది.. మధ్యంతర ఎన్నికలు తధ్యం : ఎన్‌సీపీ చీఫ్ Sharad Pawar

ముంబై: బీజేపీ(BJP) మద్ధతుతో సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సారధ్యంలో మహారాష్ట్ర(Maharastra) కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఎన్‌సీపీ(NCP) చీఫ్ శరద్ పవార్(Sharad pawar) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో షిండే ప్రభుత్వం కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. మధ్యంతర ఎన్నికల(Mid term polls)కు సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్‌కు పవార్ పిలుపునిచ్చారు. మంత్రి పదవుల పంపకం పూర్తయితే అసంతృప్తులు పెల్లుబుకుతాయని, ఫలితంగా ప్రభుత్వం కూలడం తథ్యమని ఆయన అంచనా వేశారు. బీజేపీతో పొత్తు వికటిస్తే ఎమ్మెల్యేలంతా శివసేన గూటికే తిరిగొస్తారని విశ్లేషించారు. ఆదివారం సాయంత్రం ఎన్‌సీపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా పవార్ ఈ విధంగా స్పందించారని ఎన్‌సీపీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలపడంపై పవార్ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 


కాగా బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా 2019లో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించినా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. దీంతో మూడు పార్టీలతో ఏర్పాటైన కూటమి పూర్తికాలం కొనసాగదని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. వారన్నట్టుగానే ఇటివల ప్రభుత్వం కూడా పడిపోయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-04T21:05:27+05:30 IST