Advertisement

పిల్లల విషయంలో shilpa shetty ఆ నిర్ణయం తీసుకుందా? Raj Kundraకు దూరంగా..

ప్రముఖ సెలబ్రిటీగా, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా భార్యగా బాలీవుడ్‌లో మొన్నటివరకు వైభవంగా గడిపింది శిల్పా శెట్టి. అయితే పోర్నోగ్రఫీ కేసులో కుంద్రా అరెస్ట్ కావడంతో శిల్ప జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. రాజ్‌కుంద్రా చేసిన పనికి శిల్పాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ఆమె పైనే కాదు.. ఆమె పిల్లలు వియాన్, షమిషాపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అయినా శిల్ప ధైర్యం కోల్పోకుండా సోషల్ మీడియా ద్వారా జవాబులు చెప్పింది. 


అంతేకాదు తను న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న `సూపర్ డ్యాన్సర్-4` రియాలిటీ షోకు మళ్లీ రావడం ప్రారంభించింది. దీంతో శిల్ప మనో ధైర్యంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా శిల్ప తన పిల్లల విషయంలో ఓ నిర్ణయం తీసుకుందట. తన పిల్లలను రాజ్ కుంద్రా ఆస్తులకు దూరంగా ఉంచాలని భావిస్తోందట. పూర్తిగా తన సంపాదనతోనే పిల్లలను పోషించాలని నిర్ణయించుకుందట. తనపై వచ్చిన ట్రోలింగ్‌ను శిల్ప తేలిగ్గానే తీసుకుందని, అయితే పిల్లలను కూడా విమర్శించడం ఆమె భరించలేకపోయిందని శిల్ప సన్నిహితులు అంటున్నారు. 

Advertisement

Bollywoodమరిన్ని...