Advertisement

కష్ట కాలంలో... 12 ఏళ్ల కిందటి మథుర క్షణాలు గుర్తు చేసుకున్న Shilpa Shetty!

పన్నెండేళ్ల కింద ఇదే రోజున రాజ్‌ కుంద్రాను పెళ్లాడింది శిల్పా శెట్టి. తాజాగా తమ 12వ వివాహ వర్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఆనాటి ఫోటోస్ షేర్ చేసింది. పెళ్లికూతురుగా శిల్పాను, పెళ్లికొడుగ్గా రాజ్‌కుంద్రాను చూసి ‘సాగరకన్య’ అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, పెళ్లినాటి చిత్రాలతో పాటూ తన మనసులోని మాటను కూడా బయట పెట్టింది బాలీవుడ్ సీనియర్ నటి... 


‘‘ఈ క్షణం, ఈ రోజు... 12 ఏళ్ల కిందట... మథుర క్షణాల్ని కలసి పంచుకుంటామనీ, పరీక్ష సమయాల్ని జతగా ఎదుర్కొంటామనీ మేం ప్రమాణం చేశాం... అది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం!’’ అనే అర్థం వచ్చేలా శిల్పా శెట్టి తన పోస్టులో రాసింది. అంతే కాదు, ‘‘మా కష్టంలో, సుఖంలో మాకెప్పుడూ అండగా నిలిచిన వారందరికీ, మా శ్రేయోభిలాషులకీ... హృదయపూర్వక కృతజ్ఞతలు!’’ అని కూడా శిల్పా శెట్టి చెప్పింది.     


కొన్నాళ్ల కిందట శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో జైలుకి వెళ్లాడు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న అతడి కారణంగానే బీ-టౌన్ బ్యూటీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆమె భర్తతో కలసి పలు ఆరోపణల కారణంగా... కోర్టులో కేసుల్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి నేపథ్యంలో ‘‘పెళ్లినాటి ప్రమాణం కొనసాగిస్తూనే ఉంటాం...’’ అని శిల్పా చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Advertisement

Bollywoodమరిన్ని...