Jun 30 2021 @ 15:40PM

శిల్పాశెట్టి 'హంగామా -2' రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి, పరేశ్ రావెల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత నటిస్తున్న సినిమా 'హంగామా -2'. తాజాగా ఈ సినిమ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఇంతకముందు వచ్చిన 'హంగామా'కు సీక్వెల్ కాదట. కానీ 'హంగామా'లోని మస్తీ, మిశ్చిఫ్, ఫన్ ఇందులోనూ ఉన్నాయి. అందుకే 'హంగామా -2' పెట్టామని ప్రియదర్శన్ చెప్పారు. దాదాపు ఏడేళ్ళ తర్వాత ప్రియదర్శన్ 'హంగామా -2'తో మళ్ళీ బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇస్తుండగా, 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శిల్పాశెట్టి వెండితెర మీద సందడి చేయబోతుండటం విశేషం. 'హంగామా -2' గత యేడాది ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిచారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఈ యేడాది ఫిబ్రవరిలో చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యే సూచనలు కనిపించకపోవడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 1న విడుదల కాబోతున్న ట్రైలర్ మిస్ కావద్దంటూ, రిలీజ్ డేట్ పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో శిల్పాశెట్టి పోస్ట్ చేశారు. ఇక 'హంగామా -2' జూలై 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

Bollywoodమరిన్ని...