మీడియాపై పరువునష్టం కేసు వేసిన బాలీవుడ్ హీరోయిన్

ముంబై: 29 మీడియా సంస్థలు, జర్నలిస్ట్‌లపై బాలీవుడ్ నటి శిల్పా షెట్టి పరువు నష్టం కేసు వేశారు. గురువారం బాంబే హైకోర్టులో ఈ ఫైల్ దాఖలు చేశారు. తన భర్త రాజ్‌కుంద్రతో పాటు తమ కుటుంబానికి పరువునష్టం కలిగే విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఆమే పేర్కొన్నారు. కాగా, ఈ కేసును శుక్రవారం నాడు విచారణకు తీసుకుంటామని బాంబే హైకోర్టు తెలిపింది.


ఇదిలా ఉంటే పోర్న్ రాకెట్ కేసులో రాజ్‌కుంద్రా లీలలు ఒక్కోక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా రాజ్‌కుంద్రాపై నటి షెర్లీన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేశారు. కేసు విచారణలో భాగంగా షెర్లీన్ చోప్రాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. మార్చి 2019 మార్చిలో రాజ్‌కుంద్రా, అతని టీమ్‌ను బిజినెస్ మీటింగ్ కోసం ఆమె కలిసినట్లు చెప్పారు. మీటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా రాజ్ తన ఇంటికి వచ్చారని పోలీసులకు షెర్లీన్ చోప్రా స్టెట్‌మెంట్ ఇచ్చారు. శిల్పా శెట్టితో సరైన సంబంధాలు లేవని ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటోందని రాజ్‌కుంద్రా తనతో చెప్పినట్లు ఆమె వెల్లడించారు. తనను హత్తుకుని ముద్దుపెట్టుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసుల విచారణలో షెర్లీన్ చోప్రా తెలిపారు. రాజ్‌కుంద్రా ప్రవర్తనతో భయం వేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు షెర్లీన్ చోప్రా వెల్లడించారు. 

Advertisement

Bollywoodమరిన్ని...