Advertisement

1.51 కోట్ల చీటింగ్ కేసు.. Shilpa Shetty ఏమందో తెలుసా?

అశ్లీల చిత్రాల కేసులో బిజినెస్‌మేన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టై, రెండు నెలల తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం శిల్పా దంపతులతో పాటు కషీఫ్ ఖాన్‌పై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో రూ.1.51 కోట్ల చీటింగ్ కేసు ఫైల్ అయ్యింది. దానిపై ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ద్వారా స్పందించింది.


ఆ పోస్ట్‌లో.. ‘నా మీద, రాజ్ మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసి షాక్‌కి గురయ్యాను. ఎస్‌ఎఫ్‌ఎల్ ఫిట్‌నెస్, కాషిఫ్ ఖాన్ నిర్వహిస్తున్న వెంచర్. అతను దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్ జిమ్‌లను తెరవడానికి ఈ బ్రాండ్ హక్కులను తీసుకున్నాడు. అతనే అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. అన్ని లావాదేవీలు అతనే చూసేవాడు. వాటి గురించి మాకు తెలియదు. ఈ వెంచర్‌కి సంబంధించి  మేము ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. అన్ని ఫ్రాంఛైజీలు నేరుగా కాషిఫ్‌తోనే డిలీంగ్ చేశాయి. అయితే 2014లో మూసివేసిన ఈ కంపెనీని అతనే మ్యానేజ్ చేశాడు. నేను గత 28 సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాను. నా ప్రతిష్టను దెబ్బతింటుందని ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను. భారతదేశంలో చట్టాన్ని గౌరవించే సిటిజన్‌గా నా హక్కులు రక్షించబడాలి’ అంటూ చెప్పుకొచ్చింది.


Advertisement

Bollywoodమరిన్ని...