డైలీ సీరియల్‌ను తలపిస్తున్న..శిల్పా చౌదరి కేసు

ABN , First Publish Date - 2021-12-14T13:54:42+05:30 IST

శిల్పా చౌదరి ఆర్థికమోసం కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఆమెను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు కొలిక్కి రాకపోవడంతో..

డైలీ సీరియల్‌ను తలపిస్తున్న..శిల్పా చౌదరి కేసు

మరోరోజు పోలీస్‌ కస్టడీకి అనుమతి 

హైదరాబాద్‌ సిటీ: శిల్పా చౌదరి ఆర్థికమోసం కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఆమెను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు  కొలిక్కి రాకపోవడంతో.. తాజాగా మూడోసారి ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పాచౌదరిని మరో రోజు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుమారు వంద కోట్ల ఆర్థిక మోసాల కేసులో అరెస్ట్‌ అయిన  శిల్పాచౌదరి ఎలాంటి వివరాలు వెల్లడించకుండా మొండికేయడం, మరోవైపు తీసుకున్న డబ్బులకు లెక్కలు లేకపోవడం, శిల్పా చౌదరి పెట్టుబడులు పెట్టినట్లుగా చెప్తున్న వ్యక్తుల వద్ద ఆమె డబ్బులిచ్చినట్లు ఆధారాలు లేకపోవడం, ఇలా అనేక మలుపుల  నడుమ పోలీసుల దర్యాప్తు ఎటూ తేలడంలేదు. రెండోసారి కస్టడీలో శిల్పాచౌదరికి సంబంధించి ఐదు బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తించి సీజ్‌ చేశారు. కానీ వాటిల్లో రూ. వేలు మాత్రమే ఉండడంతో కంగుతిన్నారు. శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో మరొకరోజు పోలీస్‌ కస్టడీని పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి ఇవ్వాలని ఆదేశించింది. దాంతో మంగళవారం ఉదయం 10 గంటలకు శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకొని.. అదే రోజు సాయంత్రానికి తిరిగి చంచల్‌గూడ జైల్లో అప్పగించనున్నారు.

Updated Date - 2021-12-14T13:54:42+05:30 IST