వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-16T05:53:52+05:30 IST

వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి

వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి

మహేశ్వరం/యాచారం: యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందర్‌రావు అన్నారు. స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మహేశ్వరం మండలం పెండ్యాల నవభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో డబిల్‌గూడ గ్రామానికి చెందిన పోతుల మల్లమ్మ స్మారకార్థం ఆమె కుమారులు రాఘవేందర్‌, ప్రసాద్‌ల ఆర్థిక సౌజన్యంతో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ క్రీడల ముగింపునకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై  విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో 39 టీంలు పాల్గొనగా పెండ్యాల టీం మొదటి బహుమతి, బాటసింగారం రెండవ, రాంచంద్రగూడ మూడవ, రావిరాల టీం నాల్గవ స్థానంలో నిలిచాయి. టగ్‌ ఆఫ్‌ వార్‌లో 10 టీంలు పాల్గొనగా మొదటి బహుమతికి గూడూరు, రెండవ బహుమతికి రాంచంద్రగూడ టీంలు ఎంపికయ్యాయి. స్వామి వివేకానంద ఆశయసాధన కోసం యువత పాటుపడాలని బీజేపీ యాచారం మండల అధ్యక్షుడు తాండ్ర రవి అన్నారు. మండల పరిధి తమ్మలోనిగూడ గ్రామంలో బీజేపీ నాయకుడు గంగలశ్రీనివాసయాదవ్‌ స్మారక వాలీబాల్‌ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో దెంది రాంరెడ్డి, శ్రీశైలం, దెంది కరుణాకర్‌, శేఖర్‌, మొగులయ్య, సత్తిరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T05:53:52+05:30 IST