కరోనాకు ‘గేటెడ్‌’

ABN , First Publish Date - 2020-03-30T09:49:32+05:30 IST

హైటెక్‌ సిటీలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ మదీనగూడలో ఉన్న మైహోం జ్యూవెల్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 14 బ్లాకులు, 2016ప్లాట్లల్లో 8వేల మంది నివసిస్తున్నారు.

కరోనాకు ‘గేటెడ్‌’

మియాపూర్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): హైటెక్‌ సిటీలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ మదీనగూడలో ఉన్న మైహోం జ్యూవెల్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 14 బ్లాకులు, 2016ప్లాట్లల్లో 8వేల మంది నివసిస్తున్నారు. వీరు గేటెడ్‌ కమ్యూనిటీలోనే నిత్యావసరాలు, పాలు, కూరగాయలు ఇతరత్రా అవసరాల కోసం ముందుగానే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఈనెల 22న జనతా కర్ఫ్యూను విధించిన నేపఽథ్యంలో వారంతా జనతా కర్ఫ్యూ సక్సె్‌సలో భాగస్వాములయ్యారు. ఈ నేపఽథ్యంలోనే 23 నుంచి ఏప్రిల్‌ 14వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో బయటకు రాకుండా స్వీయ గృహనిర్బంధంలో ఉండడానికి అసోసియేషన్‌ సంఘం డిజిటల్‌ మీడియా ద్వారా వాట్సా్‌పలో ప్రతి బ్లాక్‌కు ఓ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. 


నిత్యావసరాలు సైతం గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్న దుకాణాల నుంచి తెచ్చుకోవడానికి కొంతమంది సభ్యులతో 50మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్లలో ఉన్న 8 వేలమంది జనాభాకు దుకాణాల్లోకి 50 మంది మాత్రమే వెళ్లి సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వీయ నియంత్రణతో కమిటీ సూచనలు పాటిస్తున్నారు. 14 బ్లాక్‌లోని పరిసరాల పరిశుభ్రత కోసం గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్న వారితో రోజుకు నాలుగు సార్లు శానిటేషన్‌ చేయిస్తున్నారు. దీంతో బయట నుంచి పనిమనుషులు రాకుండా చర్యలు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం తదితర అంశాలపై కమిటీ అప్పటికప్పుడు డిజిటల్‌ మీడియా ద్వారా సూచనలు అందిస్తోంది. గేటెడ్‌ కమ్యూనిటీ అంతా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. వినూత్న రీతిలో వీరు చేపట్టిన లాక్‌డౌన్‌ సక్సెలో భాగస్వాములైనందుకు గేటెడ్‌ వాసులందరూ తాము అన్ని సౌకర్యాలు పొందుతూనే ఎక్కడా అసౌకర్యం లేకుండా సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. 


డిజిటల్‌ మీడియా ద్వారా స్వీయ నిర్బంధం..ప్రశాంత్‌ కొనగంటి, మైహోం జ్యూవెల్‌ గేటెడ్‌ కమ్యూనిటీ అధ్యక్షుడు 

అందరి ఏకాభిప్రాయంతో గడప దాటకుండా లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నాం. కమ్యూనిటీలోని 50మంది వలంటీర్లతో నిత్యావసరాలు, కూరగాయలు ఇళ్లలోకి అందిస్తున్నాం. రోజుకు నాలుగు సార్లు బయటి నుంచి పనిమనుషులు రాకుండా లోపలున్న వ్యక్తులతోనే పరిశుభ్రతపై శానిటేషన్‌ నిర్వహిస్తున్నాం. ఎవరికి వారే స్వీయ నిర్బంధానికి ముందుకు రావడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం.    

 

Updated Date - 2020-03-30T09:49:32+05:30 IST