Oct 28 2021 @ 16:00PM

నాతో 3 వీడియోలు తీశారు కానీ డబ్బులివ్వలేదంటూ.. Raj Kundra పై Sherlyn Chopra కౌంటర్ అటాక్.. రూ.75 కోట్ల నష్టపరిహారం..!

సీనియ‌ర్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భ‌ర్త రాజ్‌కుంద్రాపై హాట్ భామ షెర్లిన్ చోప్రా రివ‌ర్స్ అటాక్‌కు దిగింది. తనపై రూ.50 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టికి ఆమె షాకిచ్చింది. ఫోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో న‌టి షెర్లిన్ త‌మ ప‌రువుకు న‌ష్టం క‌లిగించేలా ఆరోప‌ణ‌లు చేసిందంటూ శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంప‌తులు ఆమెపై రూ.50 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేశారు.


ఈ నేప‌థ్యంలో షెర్లిన్ తాజాగా శిల్పా దంప‌తుల‌పై ఎదురు దాడికి దిగింది. తనతో రాజ్‌కుంద్రా మూడు వీడియోలు తీసి డబ్బులు ఎగ్గొట్టాడని, అండర్‌వరల్డ్ మాఫియా సహకారంతో తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని, తనను మానసికంగా వేధించినందుకు గాను రూ.75కోట్లు అడుగుతూ తానే తిరిగి వాళ్లకు నోటీసులు పంపానని షెర్లిన్‌ వెల్లడించింది. రాజ్‌కుంద్రా త‌న‌ను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ గ‌త ఏప్రిల్‌లో షెర్లిన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదుపై విచారణకు తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నట్టు షెర్లిన్‌ తెలిపింది.

Bollywoodమరిన్ని...