Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 21 May 2022 19:45:03 IST

Shekar: పరువునష్టందావా వేస్తా.. నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

twitter-iconwatsapp-iconfb-icon

యాంగ్రీ స్టార్ (Angry Star) రాజశేఖర్ (Rajasekhar) కథానాయకుడిగా జీవిత (Jeevitha) దర్శకత్వంలో రూపొందించిన ‘శేఖర్’ (Shekar) సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి (Beeram Sudharkar Reddy). జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి కేవలం దర్శకురాలు మాత్రమేనని, అసలు నిర్మాతను నేనని.. ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ఈ సినిమాని నిలిపేయాలంటూ ఫైనాన్షియర్ ఎ. పరంధామరెడ్డి(A Parandhama ఇeddy)  హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


‘‘48 గంటలలోగా రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా జీవితా రాజశేఖర్‌ (Jeevitha rajashekar)సమర్పించాలి. అలా చేయని పక్షంలో ‘శేఖర్‌’ సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను (నెగటివ్‌ రైట్‌) అటాచ్‌మెంట్‌ చేస్తూ డిజిటల్‌, శాటిలైట్‌, ఓటీటీ, యూట్యూబ్‌ వంటి మాధ్యమాలతోపాటు సినిమా ట్రైలర్‌ను కూడా ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటాచ్‌మెంట్‌ అమలులోకి వస్తే ఆదివారం సాయంత్రం తర్వాత ‘శేఖర్‌’ (Shekar) సినిమాను ఏ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించినా న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు అవుతుంది’’ అని ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు. దీనికి సంబంధించిన కోర్టు కాపీని కూడా ఆయన జతచేశారు.

Shekar: పరువునష్టందావా వేస్తా.. నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్

అయితే ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వాదనను నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి  తోసిపుచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ‘శేఖర్’ చిత్రానికి నిర్మాతను. జీవితా రాజశేఖర్‪గారు మా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజశేఖర్‪గారు కథానాయకుడిగా నటించారు. వాళ్లిద్దరి పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్, జీవిత గార్లది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే.. ఏదైనా జరిగితే.. నేను పరువునష్టందావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచి రాబడతా. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే... అసలు నిర్మాతను నేను’’ అని హెచ్చరించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International