షీనా బోరా బతికే ఉంది:సీబీఐకు Indrani Mukerjea సంచలన లేఖ

ABN , First Publish Date - 2021-12-16T15:08:36+05:30 IST

మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌కు సంచలన లేఖ రాశారు....

షీనా బోరా బతికే ఉంది:సీబీఐకు Indrani Mukerjea సంచలన లేఖ

ముంబై: మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌కు సంచలన లేఖ రాశారు.2012వ సంవత్సరంలో తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన కేసులో ఇంద్రాణి ముఖర్జీ నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కూతురు షీనా బోరా బతికే ఉందని సీబీఐకు రాసిన లేఖలో ఇంద్రాణి పేర్కొన్నారు.కశ్మీర్‌లో షీనా బోరాను కలిశానని ఇటీవల జైలులో ఉన్న ఓ మహిళ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది.కశ్మీర్‌లో షీనా బోరా కోసం వెతకాలని ఆమె సీబీఐని కోరింది.లేఖతో పాటు ఆమె ప్రత్యేక సీబీఐ కోర్టులో ఒక దరఖాస్తు కూడా పంపారు. ఇది త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.


ఇంద్రాణి బెయిల్ దరఖాస్తు తిరస్కరణ

షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా 2015వ సంవత్సరంలో అరెస్ట్ అయినప్పటి నుంచి ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు గత నెలలో తిరస్కరించింది.త్వరలో ఆమె తన లాయర్ సనా ఖాన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.ఇంద్రాణి ముఖర్జి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ తుపాకీతో దొరకడంతో షీనా బోరా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. డ్రైవరును విచారించగా తనకు మరో కేసులో ప్రమేయముందని, హత్యను ప్రత్యక్షంగా చూసినట్లు వెల్లడించాడు.2012వ సంవత్సరంలో ఇంద్రాణి ముఖర్జి తన తోబుట్టువుగా పిలిచే షీనా బోరాను గొంతు కోసి చంపిందని శ్యాంవర్ రాయ్ ముంబై పోలీసులకు తెలిపారు.


పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ఇంద్రాణి బాగోతం 

పోలీసుల దర్యాప్తులో ఇంద్రాణి బాగోతం బయటపడింది. తదుపరి విచారణలో షీనా ఇంద్రాణికి మొదటి కుమార్తె అని, ముంబైలో తనకు ఇల్లు ఇప్పించాలని ఆమె తల్లిని బ్లాక్ మెయిల్ చేస్తోందని తేలింది.ముంబై పోలీసులు, సీబీఐ దర్యాప్తు ప్రకారం ఇంద్రాణి ముఖర్జీ తన ఇద్దరు పిల్లలైన షీనా, మిఖాయిల్‌లను గౌహతిలో తన తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టింది. షీనా మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీని వివాహం చేసుకుంది.ఆ తర్వాత ఒక పత్రికలో ఆమె ఫొటోను చూసినప్పుడు షీనాకు తల్లి గురించి తెలిసింది.ఆ తర్వాత షీనా బోరా ముంబైకు రావడంతో, ఇంద్రాణి ఆమెను తన సోదరి అని తన భర్త పీటర్‌కు కూడా పరిచయం చేసింది. అయితే షీనాబోరా 2012వ సంవత్సరంలో ఆమె కన్నుమూసింది.


షీనాబోరా అదృశ్యం...

షీనాబోరా అదృశ్యమైన తర్వాత, రాహుల్ ముఖర్జీ  (పీటర్ కుమారుడు) ఆమెకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. రాహుల్, షీనాలు ప్రేమలో పడ్డారు. ఆమె కనిపించకుండా పోయే ముందు కొంతకాలం కలిసి జీవించారు. చివరగా 2015వ సంవత్సరంలో కేసు వెలుగులోకి వచ్చినప్పుడు ఇంద్రాణి షీనాను ముంబైలోని బాంద్రాలో గొంతు కోసి చంపి, ఆపై ఆమె మృతదేహాన్ని పారవేసేందుకు పొరుగున ఉన్న రాయ్‌గడ్ జిల్లాకు తీసుకువెళ్లిందని పోలీసులు ఆరోపించారు. షీనా అవశేషాలు దొరికాయని దర్యాప్తు సంస్థలు కూడా తెలిపాయి. అయితే ఈ వాదనలను ఇంద్రాణి కొట్టి పారేసింది.ఇంద్రాణి అరెస్ట్ తర్వాత ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూడా హత్య, సాక్ష్యాలను తొలగించడంలో ఆమెకు సహాయం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. కుట్రలో భాగంగా పీటర్ ముఖర్జీని కూడా సీబీఐ అరెస్టు చేసింది. అయితే పీటర్ కు 2020లో బెయిల్ లభించింది. విచారణ సమయంలో పీటర్, ఇంద్రాణి ముఖర్జీలు విడాకులు తీసుకున్నారు.


Updated Date - 2021-12-16T15:08:36+05:30 IST