అమెరికా హౌస్ స్పీకర్ ల్యాప్‌టాప్‌ను రష్యాకు అమ్మేందుకు మహిళ ప్లాన్

ABN , First Publish Date - 2021-01-19T22:22:24+05:30 IST

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఇటీవల జరిగిన హింస గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. జో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు

అమెరికా హౌస్ స్పీకర్ ల్యాప్‌టాప్‌ను రష్యాకు అమ్మేందుకు మహిళ ప్లాన్

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఇటీవల జరిగిన హింస గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. జో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనంపై దాడికి దిగారు. ఈ దాడి సమయంలో పెన్సిల్వేనియాకు చెందిన ఓ మహిళ అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ల్యాప్‌టాప్‌ను దొంగిలించింది. దొంగిలించిన ల్యాప్‌టాప్‌ను ఆమె రష్యాకు చెందిన ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్, ఎస్వీఆర్‌కు అమ్మేందుకు ప్రయత్నించినట్టు మహిళ మాజీ భర్త తాజాగా ఎఫ్‌బీఐతో చెప్పాడు. అయితే రష్యాకు ల్యాప్‌టాప్ అమ్మాలనుకున్న ఆమె ప్లాన్ ఫెయిల్ అయినట్టు తెలిపాడు. ఇప్పుడు ఆ ల్యాప్‌టప్ తన మాజీ భార్య దగ్గరే ఉండొచ్చని లేదా దాన్ని నాశనం చేసి ఉండొచ్చని అన్నాడు. మహిళ మాజీ భర్త ఇచ్చిన వివరాల ద్వారా ఈ అంశంపై యూఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది. కాగా.. జనవరి 20న జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated Date - 2021-01-19T22:22:24+05:30 IST