‘ఉమెన్‌ సేఫ్టీ’పై షీ టీమ్స్‌ ఆన్‌లైన్‌ కాంటెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-21T20:51:24+05:30 IST

తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ ఏడో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది.

‘ఉమెన్‌ సేఫ్టీ’పై షీ టీమ్స్‌ ఆన్‌లైన్‌ కాంటెస్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్‌ ఏడో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈమేరకు మహిళ భద్రత పై ఆన్‌లైన్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనే వారికి బహుమతులను కూడా అందించనున్నట్టు పోలీసుశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న వారు మహిళా రక్షణపై డ్రాయింగ్స్‌, క్రియేటివ్‌ రైటింగ్స్‌, పోయమ్స్‌, మీమ్స్‌, షార్ట్‌ వీడియోలు, ఆసక్తిని కలిగించే ఫోటోలను తెలంగాణ షీటీమ్స్‌ వాట్సప్‌ నెం. 9441669988కు పంపాల్సి వుంటుంది.


వచ్చిన దరఖాస్తులను ఫార్ట్‌లిస్ట్‌ చేసి పోటీదారులకు బహుమతులను అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈపోటీల్లో పాల్గొనాలనుకునే వారు తమ ఎంట్రీలను ఈనెల 24వ తేదీ పంపాల్సి ఉంటుందని తెలిపారు. ఈనెల 25న విజేతలను ఫేస్‌బుక్‌, అఫీషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, పత్రికా ప్రకటనల ద్వారా వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-21T20:51:24+05:30 IST