‘అలెక్సా’కు మాటలు నేర్పింది!

ABN , First Publish Date - 2020-03-08T05:50:57+05:30 IST

అలెక్సా... ప్లే లవ్‌ సాంగ్స్‌... అలెక్సా.... బుక్‌ ఎ మీల్‌... ...‘స్మార్ట్‌’ యుగంలో సంచలనం ‘అమెజాన్‌ అలెక్సా’. కొన్నేళ్ల కిందటి వరకు వాయిస్‌ అసిస్టెంట్‌ అనేది ఊహలకందని ఫీచర్‌. కానీ ఇప్పుడు ‘అలెక్సా’తోనే చాలామందికి రోజు మొదలవుతుంది. ఆ డివైజ్‌ను ఆపు...

‘అలెక్సా’కు మాటలు నేర్పింది!

సమానత్వం... ఈ మాట అనడానికి బాగుంటుంది కానీ, పాటించడానికి చాలా ధైర్యం కావాలి. ఈ సమానత్వం కోసమే మహిళలు ఎన్నో ఏళ్లుగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి ముగ్గురు విజేతలకు ‘త్రీ ఛీర్స్‌’ చెబుదాం!


అలెక్సా... ప్లే లవ్‌ సాంగ్స్‌...  అలెక్సా.... బుక్‌ ఎ మీల్‌... ...‘స్మార్ట్‌’ యుగంలో సంచలనం ‘అమెజాన్‌ అలెక్సా’. కొన్నేళ్ల కిందటి వరకు వాయిస్‌ అసిస్టెంట్‌ అనేది ఊహలకందని ఫీచర్‌. కానీ ఇప్పుడు ‘అలెక్సా’తోనే చాలామందికి రోజు మొదలవుతుంది. ఆ డివైజ్‌ను ఆపు... దీన్ని ప్లే చెయ్యి... అంటూ సగటున సెకనుకు ఐదుసార్లు ‘అలెక్సా’ను అడుగుతున్నారట! ముఖ్యంగా 2017లో ఇది భారత్‌కు వచ్చాక వాడకం ఐదు రెట్లు పెరిగిందట! ప్రస్తుతం 800 స్కిల్స్‌తో లక్షల మందికి చేరువైన ‘అలెక్సా’ను ఆడిస్తున్నది ఎవరో తెలుసా..! మహిళలు! అందులో మన తెలుగమ్మాయి కూడా ఉంది. ఆమే రమ్యా పూసర్ల. 

విశాఖపట్టణానికి సమీపంలో ఓ చిన్న గ్రామం రమ్యది. మొదటి నుంచి బాగా చదువుకోవాలన్న తపన. కెరీర్‌లో ఉన్నతంగా స్థిరపడాలన్న పట్టుదల. ఇవే ఆమెకు బిట్స్‌ పిలానీ- హైదరాబాద్‌లో సీటు తెచ్చిపెట్టాయి. ఇంజనీరింగ్‌ చదువుతుండగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో అమెజాన్‌ కంపెనీకి ఎంపికయ్యారు. కంప్యూటర్‌ సైన్స్‌(2014)లో గ్రాడ్యుయేషన్‌ చేసిన వెంటనే ఉద్యోగంలో చేరారు. ఆమెకు అమెజాన్‌ ప్రతిష్ఠాత్మకంగా భారత్‌కు తీసుకువచ్చిన ‘అలెక్సా ఎకో’ ప్రాజెక్టులో కీలక బాధ్యతలు అప్పగించింది. 


సవాలుగా తీసుకొని... 

నిజానికి ‘అలెక్సా’ ప్రాజెక్ట్‌ ఎంతో క్లిష్టమైంది. విభిన్నమైనది. ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం ఉంటేనే సరిపోదు... కస్టమరు ఏమేమి కావాలనుకొంటున్నారో వాటన్నింటినీ ముందస్తుగానే అంచనా వేసి, అనుభవాన్ని రంగరించి రూపొందించాలి. ‘అలెక్సాలో పని చాలా భిన్నమైనది. సవాళ్లతో కూడుకున్నది. గతంలో నేను చేసినదానికి... దీనికి ఏ మాత్రం సంబంధం లేదు’ అంటారు రమ్య. ఆమె అంతకుముందు ‘విజువల్‌ స్ర్కీన్‌ ఇంటర్‌ఫేసెస్‌’కు సంబంధించి పనిచేశారు. కానీ ఇప్పుడు డీల్‌ చేస్తున్నది ‘వాయిస్‌ ఇంటర్‌ఫేస్‌’. 

ప్రస్తుతం అమెజాన్‌  బెంగళూరు శాఖలో పనిచేస్తున్న రమ్య... ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగానే వాల్‌మార్ట్‌ ల్యాబ్‌లో ఇంటర్న్‌గా చేశారు. కస్టమర్‌ అకౌంట్స్‌ నిర్వహించే బృందంలో అనుభవం గడించారు. అంతకుముందు విశాఖపట్టణంలోని స్టీల్‌ ఎక్చేంజ్‌ ఇండియా లిమిటెడ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేశారు. అమెజాన్‌లో చేరిన తరువాత చైనాలో ఆ సంస్థ గ్లోబల్‌ స్టోర్‌ లాంచింగ్‌లో కీలక పాత్ర పోషించారు. 

Updated Date - 2020-03-08T05:50:57+05:30 IST