Noida woman: నోయిడా మహిళ నాకు సోదరి లాంటిది...శ్రీకాంత్ త్యాగి తాజా వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-10T16:53:57+05:30 IST

నోయిడా నగరంలో ఓ మహిళను దూషించి అరెస్టు అయిన స్వయం ప్రకటిత బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....

Noida woman: నోయిడా మహిళ నాకు సోదరి లాంటిది...శ్రీకాంత్ త్యాగి తాజా వ్యాఖ్యలు

నోయిడా(ఉత్తరప్రదేశ్): నోయిడా నగరంలో ఓ మహిళను(Noida woman) దూషించి అరెస్టు అయిన  స్వయం ప్రకటిత బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి(Shrikant Tyagi) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దుర్భాషలాడిన నోయిడా మహిళ తనకు సోదరి(my sister) లాంటిదని శ్రీకాంత్ త్యాగి వ్యాఖ్యానించారు.తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు.నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో ఒక మహిళను దుర్భాషలాడి, దాడి చేసినందుకు మంగళవారం నోయిడా పోలీసులు శ్రీకాంత్ త్యాగిని అరెస్టు చేశారు. పోలీసులు కోర్టు నుంచి తీసుకెళుతున్న సమయంలో శ్రీకాంత్ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


తాను దాడికి పాల్పడ్డానని ఆరోపించిన మహిళ తనకు సోదరి లాంటిదని, ఈ ఘటన అంతా రాజకీయమేనని శ్రీకాంత్ చెప్పారు. ‘‘ఈ ఘటనపై నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె నా సోదరి లాంటిది’’ అని శ్రీకాంత్ అన్నారు.

5 రోజుల పాటు 100 మంది పోలీసుల గాలింపు

నోయిడా మహిళను దూషించిన శ్రీకాంత్ త్యాగిని అరెస్టు(arrest) చేసేందుకు 5 రోజుల పాటు 100 మంది పోలీసులు గాలించారు. మహిళను వేధించిన వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయింది. త్యాగి సెల్ ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు మీరట్ నగరంలో అతన్ని అరెస్టు చేశారు. 


స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, క్రైంబ్రాంచ్ పోలీసులు(special operations group, crime branch) గాలింపుతో త్యాగి ఆచూకీ లభించింది. త్యాగి ఆచూకీ చెప్పిన వారికి 25వేలరూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. త్యాగి మీరట్, ముజఫ్పర్ నగర్, హరిద్వార్ నగరాల్లో మూడు సార్లు పోలీసుల బారినుంచి తప్పించుకున్నాడు. 



త్యాగి ఇల్లు బుల్డోజరుతో కూల్చివేత

వాహనాలు, లొకేషన్లు,ఐదు కార్ల నంబర్లు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్న త్యాగిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యునిగా సోషల్ మీడియాలో తనను తాను ప్రకటించుకున్న శ్రీకాంత్ త్యాగితోపాటు మరో ముగ్గురిని మీరట్ నగరంలో అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.నోయిడాలోని సెక్టార్-93బిలోని గ్రాండ్ ఓమాక్స్ హౌసింగ్ సొసైటీలో శ్రీకాంత్ ఇంటి వెలుపల ఉన్న అక్రమ నిర్మాణాన్ని బుల్డోజర్లు కూల్చివేసిన ఒక రోజు తర్వాత అతన్ని అరెస్టు చేశారు.



Updated Date - 2022-08-10T16:53:57+05:30 IST