యూఏఈలో క‌నిపించిన నెలవంక...

ABN , First Publish Date - 2020-05-23T19:25:52+05:30 IST

యూఏఈలో శ‌నివారం ఉద‌యం షవ్వాల్ నెలవంక కనిపించిందని అస్ట్రోన‌మీ సెంట‌ర్ ప్ర‌క‌టించింది.

యూఏఈలో క‌నిపించిన నెలవంక...

యూఏఈ: యూఏఈలో శ‌నివారం ఉద‌యం షవ్వాల్ నెలవంక కనిపించిందని అస్ట్రోన‌మీ సెంట‌ర్ ప్ర‌క‌టించింది. ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు అబుధాబిలో ఈద్-ఉల్-ఫితర్ నెలవంక ఫొటో తీయ‌డం జ‌రిగింద‌ని అస్ట్రోన‌మీ సెంట‌ర్ ట్వీట్ చేసింది. ఈ సంద‌ర్భంగా తీసిన‌ చంద్రుని ఫొటోను కూడా ట్వీట్‌తో జ‌త చేసింది. 6.2 డిగ్రీల‌తో ఈ నెల‌వంక ఉన్న‌ట్లు సెంట‌ర్ పేర్కొంది. ఇక ఇప్ప‌టికే సౌదీ అరేబియాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను మే 24వ‌ తేదీన జరపాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. సౌదీతో పాటు యూఈఏ, ఈజిప్ట్‌, కువైట్‌, బ‌హ్రెయిన్‌, జోర్డాన్‌లో కూడా శ‌నివార‌మే ఈద్-ఉల్-ఫితర్ జ‌రుపుకోనున్నారు.



Updated Date - 2020-05-23T19:25:52+05:30 IST