Shashikala పేరులో మార్పు!

ABN , First Publish Date - 2022-06-08T16:00:28+05:30 IST

ఎంత ప్రయత్నించినా అన్నాడీఎంకేపై పట్టు దొరక్కపోతుండడంతో డైలమాలో పడిన వీకే శశికళ.. తన లక్ష్యం నెరవేరేదిశగా పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Shashikala పేరులో మార్పు!

ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 7: ఎంత ప్రయత్నించినా అన్నాడీఎంకేపై పట్టు దొరక్కపోతుండడంతో డైలమాలో పడిన వీకే శశికళ.. తన లక్ష్యం నెరవేరేదిశగా పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జ్యోతిష్యుల సూచనల్నికూడా పాటిస్తున్నారు. ఇన్నాళ్లూ వీకే శశికళ అని వున్న తన పేరు ముందు తన భర్త, దివంగత నటరాజన్‌ పేరు పెట్టాలని (ఇనిషియల్‌గా) నిర్ణయించుకున్నారు. అంతేగాక ప్రస్తుతం తను నివశిస్తున్న టి.నగర్‌లోని నివాసంలో వాస్తు దోషం వున్నందున, వేరే ఇంటికి మారాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అప్పుడైనా తన జాతకం మారుతుందని శశికళ గట్టిగా విశ్వస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-06-08T16:00:28+05:30 IST